విద్యార్థుల బాహాబాహీ

Mutual Attacks With Sticks And Stones During Birthday Celebration In Khammam - Sakshi

పుట్టినరోజు వేడుకలో కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు

సత్తుపల్లి: విద్యార్థులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని భయానక వాతావరణం సృష్టించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సీనియర్, జూనియర్‌ విద్యార్థుల మధ్య శనివారం సాయంత్రం  ఈ ఘర్షణ జరిగింది. కళాశాలకు చెందిన ఓ జూనియర్‌ విద్యార్థి పుట్టినరోజు వేడుకల్లో అతడిపై కేక్‌ పూయడంతో మొదలైన వివాదం... మరో జూనియర్‌ విద్యార్థి సీనియర్‌ను సిగరెట్‌ అడగటంతో ముదిరింది.

జూనియర్లు, సీనియర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాసేపటి తర్వాత అందరూ తిరిగి కళాశాలకు వెళ్లిపోయారు. సాయంత్రం మళ్లీ మరో జూనియర్‌ విద్యార్థి తన స్నేహితులను వెంటబెట్టుకొచ్చి కర్రలతో దాడి చేయటంతో గొడవ తీవ్రమయ్యింది. కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు జాతీయ రహదారిపైనే కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో స్థానికులు భయభ్రాంతులయ్యారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టినట్టు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top