
అధికార పార్టీ ఎమ్మెల్యేల కుట్ర భగ్నం కావడం పట్ల..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ నేతలకు వల వేసేందుకు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేసి భారీగా నగదు పట్టుకున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ బేరసారాలకు లొంగదని చెప్పారు ఎమ్మెల్యే బాలరాజు. ఇది కేసీఆర్ పార్టీ.. ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే తమ లక్ష‍్యమని పేర్కొన్నారు.
మరోవైపు.. తెలంగాణ సమాజం అమ్ముడుపోదన‍్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్. నిస్సిగ్గుగా తమ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీపై తెలంగాణ సమాజం తిరగబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సాక్షిగా బీజేపీ కుట్రలు బయటపడ్డాయన్నారు. తమ ఎమ్మెల్యేలు ధైర్యంగా కుట్రను బయటపెట్టారని అన్నారు.
ఇదీ చూడండి: మునుగోడు లక్ష్యంగా టీఆర్‌ఎస్ నేతలకు వల.. రూ.100 కోట్లతో డీల్