బీజేపీకి గుణ‌పాఠం చెప్పాలి: హ‌రీష్ రావు

Minister Tanneru Harish Rao Visits Dubbaka Constituency In Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట :  తెలంగాణ రాష్ర్ట ప్ర‌జ‌ల గోడు అర్థ‌మ‌య్యేలా బీజేపీకి డిపాజిట్లు గ‌ల్లంత‌య్యేలా దుబ్బాక ప్ర‌జ‌లు తీర్పు చెప్పాల‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నారు.  జిల్లాలోని దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం పద్మనాభునిపల్లి గ్రామంలో మంత్రి  హరీశ్ రావు పర్యటించారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు బాణాసంచా పేల్చి డప్పు చప్పుళ్లతో అడుగడుగునా మంత్రికి ఘన స్వాగతం పలికారు.   గ్రామ మహిళలు మంగళహారతులు పట్టి, కుంకుమ తిలకం దిద్దారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థికి త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలుపుతూ గ్రామ‌స్తులు తీసుకున్న ఏక‌గ్రీవ తీర్మాణ ప‌త్రాన్ని పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామ‌స్తులు మంత్రికి అందించారు. కుల‌సంఘాలు త‌మ మ‌ద్ద‌తు తెలుపుతూ తీర్మాణ ప‌త్రాల‌ను అంద‌జేసి ఎల్ల‌మ్మ దేవాల‌యంలో  ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. గ్రామ‌స్తులు టీఆర్ఎస్‌పై   ఉంచిన న‌మ్మ‌కానికి శిర‌స్సు వంచి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నార‌న్నారు. (సుమేధ మృతి: మంత్రి కేటీఆర్‌పై ఫిర్యాదు)

'నన్ను అసెంబ్లీకి పంపడంలో మొదటి  పాత్ర దుబ్బాక నియోజకవర్గ పద్మనాభునిపల్లె గ్రామానిద.  కేసీఆర్ కృషి వల్ల కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకున్నామని, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చడమే సీఎం ధ్యేయం. తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చాక అన్నీ మెరుగ‌య్యాయి. ప్ర‌తీ ఇంటికీ తాగునీరు, ప్ర‌తీ ఎక‌రానికి సాగునీరు  అందించ‌డ‌మే  టీఆర్ఎస్ పార్టీ నినాదం. కాలంతో ప‌ని లేకుండా  కాళేశ్వరం నీళ్లతో పద్మనాభునిపల్లె చెరువు నిండుకుండ‌లా ఉంటుంది.  గ్రామంలో యేడాది కిందటే  మద్యం నిషేధం చేసిన గ్రామ యువత, విద్యార్థులను అభినందిస్తున్నా. బడా కార్పోరేట్ వేత్తల ముసుగులో నయా జమీందారు వ్యవస్థను బీజేపీ తెస్తున్నది. బీజేపీ.. రైతులను తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నది.  వ్యవసాయాన్ని కార్పోరేటీకరణ, మార్కెట్లను రద్దు చేసే బీజేపీకి ఓటు బ్యాలెట్ తో తగిన గుణపాఠం చెప్పాలని' ఈ సంద‌ర్భంగా  మంత్రి హ‌రీష్ కోరారు. (ఆ పార్టీలు రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top