మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’

Minister Malla Reddy: 100 Crore Sensation In IT Searches - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ సోదాల్లో రూ.100 కోట్ల వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల్లో కోట్లు డొనేషన్లు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 100 కోట్ల డొనేషన్ల పంచనామాపై ఐటీ అధికారులు సంతకం తీసుకున్నారు. సోమవారం ఐటీ విచారణకు హాజరుకావాలని మంత్రి మల్లారెడ్డి సహా, ఆయన కుమారులు, అల్లుడికి ఐటీ నోటీసులు జారీ చేసింది.

ఇంజనీరింగ్ కాలేజీలో మూడు సంవత్సరాల్లో 100 కోట్లు డొనేషన్ల పేరుతో వసూలు చేయించారని మహేందర్ రెడ్డితో ఐటీ సంతకం తీసుకుంది. తన కొడుకుతో బలవంతంగా సంతకం పెట్టించారని ఐటీ అధికారులతో మల్లారెడ్డి వాదనకు దిగారు. ఇష్టం వచ్చినట్లు కోట్ల రూపాయల డొనేషన్లు పేరు చెప్పి సంతకాలు పెట్టించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తమ కాలేజీలో జరిగే  ప్రతి లావాదేవీలకు లెక్కలు ఉంటాయని మంత్రి చెబుతున్నారు.

కాగా, మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్‌ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్‌ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్‌ చేశారు.
చదవండి: అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. అసలేం జరిగింది? 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top