
అబిడ్స్ (హైదరాబాద్): ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా 2వ సారి ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సొసైటీ అధ్యక్షుడిగా హరీశ్‌రావు, ఉపాధ్యక్షుడిగా అశ్వినీ మార్గం, కార్యదర్శిగా సాయినాథ్ దయాకర్ శాస్త్రి, సంయుక్త కార్యదర్శి వనం సురేందర్, కోశాధికారిగా పాపయ్య చక్రవర్తితోపాటు మరో ఏడుగురు మేనేజింగ్ కమిటీ సభ్యులుగా నామినేషన్ దాఖలు చేయగా, పోటీగా మరెవ్వరూ నామినేషన్ దాఖలు చేయలేదు. కొత్త కమిటీని 30న ఎగ్జిబిషన్ సొసైటీ అధికారికంగా ప్రకటించనుంది.