మెడికో ప్రీతి కన్నుమూత.. మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని | Sakshi
Sakshi News home page

మెడికో ప్రీతి కన్నుమూత.. శోకసంద్రంలో కుటుంబసభ్యులు

Published Sun, Feb 26 2023 9:31 PM

Medico Preeti Dies NIMS Doctors Officially Confirmed  - Sakshi

సీనియర్‌ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన మెడికల్‌ పీజీ విద్యార్థిని ధరావత్‌ ప్రీతి (26) కన్నుమూసింది. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం రాత్రి 9.10 గంటలకు ప్రాణాలు విడిచినట్టు నిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీనితో ఆమె తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పాలని, నిందితుడు సైఫ్, కాకతీయ మెడికల్‌ కాలేజీ అనస్తీíÙయా విభాగం హెడ్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తగిన చర్య­లు చేపట్టేదాకా మృతదేహాన్ని తరలించబోమంటూ నిమ్స్‌ వద్ద ఆందోళనకు దిగారు. దీనితో ఆదివారం అర్ధరాత్రి తర్వాతా నిమ్స్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 
అసలేం జరిగింది? 
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిరి్నతండాకు చెందిన ధరావత్‌ నరేందర్‌ వరంగల్‌లోని ఆర్‌పీఎఫ్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు పూజ, ఉష, ప్రీతి, కుమారుడు వంశీ ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే వారు హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు వలస వచ్చారు. గాంధీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ప్రీతి.. 2022 నవంబర్‌ 18న వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ (కేఎంసీ)లో అనస్తీషియా పీజీ కోర్సులో చేరింది. థియట్రికల్‌ క్లాస్‌లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్‌ విద్యార్థులతో కలిసి ఆపరేషన్‌ థియేటర్‌లో విధులు నిర్వర్తించాలి. ఈ క్రమంలోనే సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ ఆమెపై వేధింపులకు దిగాడు. దీనిపై ప్రీతి తండ్రి నరేందర్‌ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్‌ మోహన్‌దాసు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనస్తీíÙయా విభాగాధిపతి నాగార్జునరెడ్డి సమక్షంలో గత మంగళవారం (21వ తేదీన) ప్రీతికి, సైఫ్‌కు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 

డ్యూటీలో ఉండగానే అపస్మారక స్థితికి.. 
మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలో నైట్‌ డ్యూటీలో ఉన్న ప్రీతి.. రాత్రి 12 గంటల వరకు రెండు శస్త్రచికిత్సల్లో పాల్గొంది. బుధవారం తెల్లవారుజామున తలనొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటూ జోఫర్, ట్రెమడాల్‌ ఇంజెక్షన్‌ కావాలని స్టాఫ్‌ నర్సును అడిగింది. అయితే ఉదయం ఏడు గంటల సమయంలో వైద్యుల గదిలో ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని తోటి వైద్యులు గమనించారు. గుండెపోటుకు గురైందని గుర్తించి, సీపీఆర్‌తో గుండె పనిచేసేలా చేసి.. చికిత్స ప్రారంభించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్‌గా ఉండటంతో.. ఉన్నతాధికారులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రీతిని హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే తొలుత ట్రెమడాల్‌ ఇంజక్షన్‌ ఓవర్‌డోస్‌ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు భావించారు. అయితే ప్రీతి అపస్మారక స్థితిలో కనిపించిన గదిలో సక్సినైల్‌కోలైన్, మెడజోలం, పెంటనీల్‌ ఇంజక్షన్‌ వాయిల్స్‌ దొరికాయి. దీంతోపాటు ప్రీతి గూగుల్‌లో సక్సినైల్‌కోలిన్‌ ఇంజెక్షన్‌ గురించి సెర్చ్‌ చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఏ మందు తీసుకుందన్నది తేల్చేందుకు ఆమె బ్లడ్‌ శాంపిల్స్‌ను ట్యాక్సికాలజీ పరీక్షలకు పంపారు. 

ఐదు రోజుల పాటు వెంటిలేటర్‌పైనే.. 
వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రికి తరలించే సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్‌ చేస్తూ, గుండె తిరిగి కొట్టుకునేలా చేశారు. నిమ్స్‌కు చేరుకున్న తర్వాత ఆమెకు పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న పరిస్థితుల్లో ఐదుగురు ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షించింది. హానికర ఇంజెక్షన్‌ తీసుకోవడం వల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతిన్నాయని (మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌), మెదడుపైనా ప్రభావం పడిందని గుర్తించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు ఐదు రోజులపాటు అన్ని విధాలా ప్రయతి్నంచారు. కానీ ఫలితం లేకపోయింది. 
రిమాండ్‌లో ఉన్న నిందితుడు 
ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్‌ పీజీ సీనియర్‌ విద్యార్థి సైఫ్‌పై వరంగల్‌ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్‌ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. నేరం రుజువైతే మెడికల్‌ కాలేజీ నుంచి సస్పెండ్‌ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది. 
 
ప్రీతి బాధ చెప్పుకొన్న ఆడియో కలకలం 
ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు రోజు ప్రీతి తన తల్లితో ఫోన్‌లో మాట్లాడుతూ..సైఫ్‌ తనను వేధిస్తున్న విషయాన్ని వివరించింది. తనలాంటి చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని.. సీనియర్లు అంతా ఒకటేనని వాపోయింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే తనకు నేర్పించకుండా దూరం పెడతారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం బయటపడిన ఆడియో కలకలం రేపింది. 

అవయవాలన్నీ దెబ్బతినడంతోనే.. 

ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించిందని, అయినా ఫలితం లేకపోయిందని నిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. ప్రీతి డ్యూటీలో ఉండగా తన వద్ద ఉన్న సక్సినైల్‌కోలైన్‌ ఇంజక్షన్‌ తీసుకోవడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయిందని, ఆస్పత్రికి తీసుకొచి్చన తర్వాత వెంటిలేటర్‌పై, ఎక్మో యంత్రంపై అత్యవసర వైద్యసేవలు అందించామని తెలిపారు. మొత్తంగా ఆమె నాలుగు సార్లు గుండెపోటు (కార్డియాక్‌ అరెస్ట్‌)కు గురైందని, అందులో నిమ్స్‌కు రాకముందే రెండుసార్లు వచ్చిందని వివరించారు. ప్రీతి తీసుకున్న మత్తు ఇంజక్షన్‌ కారణంగా గుండె రక్తం పంప్‌ చేసే సామర్థ్యం (ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌ ఆఫ్‌ హార్ట్‌) 28శాతానికి పడిపోయిందని.. గ్లోబల్‌ హిపోకైనేషియా, పాంక్రియాటైటిస్, అసైటిస్, ఊపిరితిత్తుల సమస్య ఏర్పడినట్టు నిర్ధారణ అయినట్టు తెలిపారు. ప్రీతి అప్పటికే థైరాయిడ్, కీళ్లవాతానికి సంబంధించి మందులు వాడుతున్నట్టు గుర్తించామని వివరించారు. 
 
నిమ్స్‌ వైద్యుడి వ్యాఖ్యలపై నిరసన 
నిమ్స్‌ ఐసీయూ వద్దలో ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగడంపై వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. ఐసీయూలోకి వచ్చి మృతదేహాన్ని చూసి, సంతకం చేయాలని వైద్యులు కోరగా.. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పేదాకా, తగిన న్యాయం జరిగేదాకా రాబోమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఓ వైద్యుడు కలి్పంచుకుంటూ ‘అయితే.. డెడ్‌ బాడీని ఇలాగే ప్యాక్‌ చేసి పంపించేయాలా?’ అని వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. దీనిపై ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర నిరసన తెలిపారు. 
 

నిమ్స్‌ వద్ద ఆందోళన.. ఉద్రిక్తత 
ప్రీతి మృతి చెందినట్టుగా ప్రకటించిన నిమ్స్‌ వైద్యులు మృతదేహాన్ని నేరుగా వరంగల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వచ్చి మృతదేహాన్ని చూసి సంతకం పెట్టాలని తల్లిదండ్రులను కోరారు. కానీ ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు దీనికి నిరాకరించారు. ప్రీతి మృతికి అసలు కారణమేంటో తేల్చాలని, ఏ ఇంజెక్షన్‌ తీసుకుందో చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఆర్‌ఐసీయూ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. అప్పటిదాకా మృతదేహాన్ని తరలించనివ్వబోమన్నారు. ప్రీతిని వేధించిన సైఫ్, మరో ఏడుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కేఎంసీ అనస్తీషియా విభాగం హెడ్‌ను సస్పెండ్‌ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

వారికి వైద్య విద్యార్థులు, గిరిజన సంఘాల నేతలు, కార్యకర్తలు, ఏబీవీపీ, ఇతర విద్యార్థి సంఘాలు, బీజేపీ నేతలు మద్దతుగా నిలవడంతో ఆదివారం రాత్రి నిమ్స్‌ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రీతి కుటుంబానికి రూ.5 కోట్లు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని గిరిజన సంఘాల నేతలు, ఎస్సీ రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయతి్నంచినా ఎవరూ ఆందోళన విరమించలేదు. దీనితో భారీగా బలగాలను మోహరించారు. 

మృతదేహాన్ని బయటికి తెచ్చి.. మళ్లీ లోపలికి.. 
నిమ్స్‌లో ఓ వైపు ఆందోళన జరుగుతుండగానే.. మరోవైపు వైద్యులు, పోలీసులు ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయతి్నంచారు. దీంతో ఆందోళనకారులు అక్కడికి వచ్చిన అంబులెన్స్‌ ముందు బైఠాయించి, దానిని వెనక్కి పంపారు. దీనితో అధికారులు మరో అంబులెన్స్‌ను తీసుకురాగా.. మృతదేహాన్ని ఆర్‌ఐసీయూ నుంచి బయటికి తీసుకురాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆర్‌ఐసీయూ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నిమ్స్‌లో రోగులకు వైద్య సేవలు అందించడంలో అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆందోళన విరమించాలని నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప విజ్ఞప్తి చేశారు. ఎమర్జెన్సీ సేవల కోసం వచ్చే రోగులకు ఇబ్బందికలుగుతోందని పేర్కొన్నారు. 

గాంధీ ​‍ఆస‍్పత్రికి మృతదేహం
సోమవారం తెల్లవారుజామున మూడు గంటల తర్వాత ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి  తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.
 
    

Advertisement
Advertisement