టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు 6 నెలల జైలు శిక్ష

Mahbubabad Mp Maloth Kavitha To Be Jailed For 6 Months In 2019 Election case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్ఎస్ నేత, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు కోర్టు షాకిచ్చింది. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు 6 నెలల జైలు శిక్ష పడిండి. జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. గత పార్లమెంట్‌  ఎన్నికల ప్రాచారంలో ఓటర్లకు డబ్బులు పంచారనే కేసులో కోర్టు తీర్పునిచ్చింది. 2019 ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలతో మాలోత్ కవితపై బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటినుంచి ఈ కేసుపై విచారిస్తున్న న్యాయస్థానం.. తాజాగా తీర్పు వెలువరించింది. కవిత ఓటర్లను ప్రలోభపెట్టారని 6 నెలల జైలు శిక్ష విధించింది. జరిమానా రూ.10వేలు కట్టిన ఎంపీకి తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top