
సాక్షి, మహబూబ్‌నగర్: ఈ చిత్రంలో ఆకుకూరలు విక్రయిస్తున్న మహిళ మహబూబాబాద్ జిల్లా రేగడి తండా గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ గుగులోతు లక్ష్మీ రామచంద్రు. జీవనోపాధికోసం తమ కుటుంబానికున్న భూమిలో ఆకుకూరలను పండించి ప్రతీరోజు ఉదయం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు వాటిని తీసుకొచ్చి విక్రయిస్తోంది. ఇదేమిటని అడిగితే ఊరికి పెదై్దతేనేం ఉపాధికి ఢోకా లేదని రూలేమీ లేదుగా!..ప్రభుత్వం నుంచి అందే అరకొర జీతం బండి పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోవడం లేదయ్యా.. అందుకే మన పని మనం చేసుకుంటే తప్పేముందని బదులిచ్చింది. శ్రమ జీవన సౌందర్యమంటే ఇదేనేమో కదూ!!