Photo Story: ఉండమ్మా.. బండి కట్టిస్తా! | Lockdown In Telangana: Women SI Helps Pregnant By Providing Vehicle | Sakshi
Sakshi News home page

Photo Story: ఉండమ్మా.. బండి కట్టిస్తా!

Jun 1 2021 2:37 PM | Updated on Jun 1 2021 5:22 PM

Lockdown In Telangana: Women SI Helps Pregnant By Providing Vehicle - Sakshi

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి యథేచ్ఛగా తిరుగుతున్న వారి ఆటకట్టిస్తున్న పోలీసులు.. మరోపక్క ఇబ్బందుల్లో చిక్కుకున్న వారిపట్ల ఔదార్యం చూపుతున్నారు. సోమవారం ఖానాపూర్‌కు చెందిన గర్భిణి పరీక్షల కోసం నిర్మల్‌ వచ్చింది. హాస్పిటల్‌లో చూపించుకునేసరికి మధ్యాహ్నం 2 గంటలు దాటిపోవడంతో ఊరెళ్లడానికి వాహనాల్లేవు.

మరో కుమార్తె, బంధువుతో కలిసి వాహనాల కోసం ఎండలో వేచిచూస్తున్న ఆమె నిర్మల్‌ రూరల్‌ మహిళా ఎస్సై సుమన్‌రెడ్డి కంటబడింది. వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్‌ఐ.. అప్పటికప్పుడు వాహనాన్ని ఏర్పాటు చేసి గర్భిణిని ఖానాపూర్‌కు పంపించారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్‌

ఒట్టు.. ఇది అదే చెట్టు 
కాలం ప్రకృతి స్వరూపాన్ని మార్చేస్తుంటుంది. మనం పెద్దగా పట్టించుకోం గానీ, ఆసక్తి ఉండి గమనిస్తే మాత్రం చాలా చిత్రంగా ఉంటుంది. ఇదిగో ఈ ఇప్పచెట్టును చూడండి.
చదవండి: ఆకలి తీరుస్తూ.. ఆదుకుంటూ

ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం పిప్పల్‌ధరిలో ఏప్రిల్‌లో ఎరుపు, పసుపు పచ్చ రంగులతో కనిపించిన చెట్టు ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఆకుపచ్చని రంగుతో నిండా ఆకులతో కళకళలాడుతూ ఆహ్లాదాన్ని పంచుతోంది. రెండు చిత్రాలను పక్కపక్కన పెట్టి చూస్తే కాలం ఎంత చిత్రమైనదో కదా అనిపిస్తుంది.

- చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్‌, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement