కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ | Telangana panchayat elections 2025 dec 11th Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

నల్లగొండ జిల్లాలో అధికారులు నిర్లక్ష్యం..

  • జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్స్ అందుబాటులో ఉంచని అధికారులు
  • చందనపల్లిలో వీల్ ఛైర్స్ లేక వృద్ధులు, వికలాంగుల తీవ్ర ఇబ్బంది
  • విషయం తెలియడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సాక్షి టీవీ
  • హుటాహుటిన నల్లగొండ నుంచి వీల్ చైర్స్ తెప్పించిన అధికారులు
2025-12-11 08:36:54

భద్రాద్రి కొత్తగూడెంలో ఇలా..

  • భద్రాద్రి కొత్తగూడెం..
  • మణుగూరు, అశ్వాపురం, బూర్గంపహాడ్, భద్రాచలం, పినపాక, చర్ల, కరకుగూడం మండలాల పరిధిలో 159 గ్రామ పంచాయతీలకు పోలింగ్
  • 1,428 పోలింగ్ స్టేషన్లు, 1,713 మంది పోలింగ్ అధికారులు, 2,295 మంది సిబ్బంది
  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో  భద్రతను కట్టుదిట్టం చేశారు.
  • పోలింగ్ కేంద్రాలలో  వెబ్ కాస్టింగ్ ఏర్పాటు
  • ఐడిఓసి కార్యాలయాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పోలింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్లు
  • మధ్యాహ్నం 2 గంటలకు లెక్కింపు.. సాయంత్రంలోపు ఫలితాలు ప్రకటన
2025-12-11 08:34:59

ఉమ్మడి మెదక్ జిల్లాలో 39 ఏకగ్రీవాలు..

ఉమ్మడి మెదక్‌..

  • ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలివిడతలో 459 గ్రామాలకు 39 ఏకగ్రీవం
  • 420 సర్పంచ్ స్థానాలకు జరగనున్న ఎన్నికలు
  • మొదటి విడతలో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ లోని 7 మండలాల్లోని 136 గ్రామ పంచాయతీల్లో 7 ఏకగ్రీవం
  • 129 గ్రామాలకు జరగనున్న ఎన్నికల్లో బరిలో 394 మంది అభ్యర్థులు
  • 1246 వార్డు స్థానాలకు 113 ఏకగ్రీవం, 1133 స్థానాలకు 2849 మంది పోటీ
  • సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ డివిజన్ లోని 7 మండలాల్లో 163 గ్రామాలకు 16 పంచాయతీలు ఏకగ్రీవం
  • మిగిలిన147 గ్రామాలకు జరగనున్న ఎన్నికలు
  • 1432 వార్డు స్థానాల్లో 224 వార్డులు ఏకగ్రీవం..1208 వార్డులకు జరగనున్న ఎన్నికలు
  • మెదక్ జిల్లాలో మెదక్ డివిజన్ లోని 6 మండలాల్లోని 160 గ్రామ పంచాయతీలకు 16 ఏకగ్రీవం
  • మిగిలిన 144 గ్రామాలకు సర్పంచ్ బరిలో 411 మంది
  • 1402 వార్డు స్థానాలకు 332 ఏకగ్రీవం, 1068 వార్డులకు 2426 మంది పోటీ
  • 2 వార్డులకు దాఖలు కానీ నామినేషన్లు
2025-12-11 08:34:59

ఖమ్మం జిల్లాలో ఇదీ పరిస్థితి..

  • ఖమ్మం జిల్లా..
  • ఖమ్మం జిల్లాలో  7 మండలాల్లోని 172 పంచాయతీలు, 1740 వార్డులకు పోలింగ్
  • 2,41,137 ఓటర్లు ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు.
  • మొదట విడత మధిర నియోజకవర్గంలో ఎర్రుపాలెం, మదిర, చింతకాని, బోనకల్ నాలుగు మండలాల్లో పోలింగ్‌.
  • ఖమ్మం నియోజకవర్గంలో  రఘునాథపాలెం, వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలంలో పోలింగ్
2025-12-11 08:34:59

పోలింగ్‌ జరిగే గ్రామాల్లో సెలవు ప్రకటన

  • మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు
  • 3,461 పంచాయతీల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ పర్యవేక్షణ
  • బందోబస్తులో సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వు, ఇతర స్పెషల్‌ పోలీస్‌ సిబ్బంది
  • విధుల్లో 50వేల మంది సివిల్‌ పోలీసులు, 60 ప్లటూన్స్‌ బృందాలు
  • రెండు వేల మంది అగ్నిమాపక, అటవీ సిబ్బంది
  • కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు పూర్తిస్థాయి విధుల్లో ఉండనున్న సిబ్బంది
  • 54 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షణ
  • పోలింగ్‌ జరిగే గ్రామాల్లో మద్యం దుకాణాలను మూసివేత
  • పోలింగ్‌ జరిగే గ్రామాల్లో స్థానికంగా సెలవు ప్రకటన
2025-12-11 07:28:00

నల్గొండలో ఘర్షణలు..

  • నల్గొండలో ఘర్షణలు..
  • నల్గొండ కేతేపల్లి మండలంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ
  • కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌లో రాళ్లు, కత్తులతో ఇరు వర్గాల దాడి
  • ఘర్షణలో నలుగురికి గాయాలు
  • కొర్లపహాడ్‌ గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు
2025-12-11 07:28:00

1,204 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం

  • రాష్ట్రంలో మొత్తం 1,204 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం
  • తొలివిడతలో 396, రెండో విడతలో 414 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
  • మూడో విడతలో 394 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవ ఎన్నిక
  • రాష్ట్రంలో 25,864 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక
  • మొదటి విడతలో 9,644 వార్డుసభ్యులు ఏకగ్రీవ ఎన్నిక
  • రెండో విడతలో 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక
  • మూడో విడతలో 7,916 వార్డుసభ్యులు ఏకగ్రీవ ఎన్నిక
  • మొత్తం 21 గ్రామాలు, 368 వార్డుల్లో దాఖలు కాని నామినేషన్లు
2025-12-11 07:23:51

పలు జిల్లాలో ఏకగ్రీవాలు..

నాగర్ కర్నూల్..

  • కల్వకుర్తి, ఊరుకొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాలలో తొలి విడత పోలింగ్.
  • 137 పంచాయతీలలో 447 సర్పంచ్‌ స్థానాలు, 1,326 వార్డులకు ఎన్నికలు.
  • 1,118 కేంద్రాలకు 1,118 పోలింగ్ ఆఫీసర్లు, 3వేల అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, 151 రిటర్నింగ్ అధికారులు నియామకం.
  • పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.

 

ఉమ్మడి కరీంనగర్..

  • ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 398 స్థానాల్లో మొదటి విడత ఎన్నికలు.
  • ఇప్పటికే 25 ఏకగ్రీవం కావడంతో  373 స్థానాల్లో ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ
  • సాయంత్రానికి వెలువడనున్న ఫలితాలు


వరంగల్..

  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటివిడత పంచాయతీ ఎన్నికలు.
  • 502 సర్పంచ్ స్థానాలు, 3796 వార్డు స్థానాలకు పోలింగ్, కౌంటింగ్.
  • సర్పంచ్ పోటీలో 1784 మంది, వార్డు స్థానాల బరిలో 9250 మంది అభ్యర్థులు.
  • ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 17,598 మంది సిబ్బంది.

నల్లగొండ..

  • నల్లగొండ జిల్లాలో 14 మండలాల్లో 318 సర్పంచ్ స్థానాలకు 2870 వార్డులకు ఎన్నిక
  • తొలి విడతలో 22 సర్పంచ్ 375 వార్డులో ఏకగ్రీవం
  • నల్లగొండ జిల్లాలో సర్పంచ్, వార్డ్ మెంబర్లు కలిపి 5600 మంది అభ్యర్థులు బరిలో
  • తొలి విడతలో నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్లో మొత్తం 14 మండలాల్లో ఎన్నికలు
  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా
  • ఎన్నికల అనంతరం విజయోత్సవాలకు, ఎలాంటి డీజేలకు అనుమతి లేదని ఇప్పటికే అధికారుల స్పష్టం

 

సూర్యాపేట..  

  • మొత్తం ఎనిమిది మండలాల్లో తొలి విడత పంచాయితీ ఎన్నికలు
  • 159 సర్పంచ్ 1240 వార్డులకు ఎన్నికలు
  • ఏడు మండలాలు 198 వార్డుల్లో ఏకగ్రీవం
  • సర్పంచ్, వార్డు పదవులకు పోటీలో 3502 మంది
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలివిడతలో ఆరు మండలాల్లో 153 సర్పంచ్, 1286 వార్డులకు ఎన్నికలు
  • 16 సర్పంచ్ పదవులు, 243 వార్డులు ఏకగ్రీవం
  • 137 గ్రామ పంచాయతీలు, 1040 వార్డులకు జరగనున్న ఎన్నికలు

 

రంగారెడ్డి..

  • షాద్ నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 153 ఎన్నికలు.
  • శంషాబాద్ మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు
  • 6 గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నిక
  • మిగతా 168 గ్రామాల్లో నేడు ఎన్నికలు
  • 168 గ్రామాల్లో సర్పంచ్ పదవి కోసం  536 మంది పోటీ
2025-12-11 07:14:07

నిజామాబాద్‌లో ఇలా..

  • నిజామాబాద్..
  • ఇప్పటికే 39 పంచాయతీలు ఏకగ్రీవం.
  • ఉమ్మడి జిల్లాలోని బోధన్, కామారెడ్డి డివిజన్ పరిధిలోని 312 పంచాయతీల్లో ఎన్నికలు.
  • 31 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు,
2025-12-11 07:14:07

తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

  • తెలంగాణలో తొలి విడతలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం. 
  • మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌.
  • పోలింగ్‌ పూర్తికాగానే కౌంటింగ్‌.
  • ఆ వెంటనే వార్డు మెంబర్లు ఉప సర్పంచిని ఎన్నుకునే ప్రక్రియ.
  • నేడు 3,834 గ్రామాలు, 27,628 వార్డుల్లో పోలింగ్. 
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
  • పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు 12,960.
  • పోటీలో ఉన్న వార్డు అభ్యర్థులు 65,455.
  • మొత్తం పోలింగ్ స్టేషన్లు 37,562.
     
2025-12-11 07:00:55
Advertisement
 
Advertisement
Advertisement