బావా బావమరుదుల ఈత సరదా.. రెండు ప్రాణాలు బలి

koheda: Two Teenagers Were Died While Swimming In Check Dam - Sakshi

సాక్షి, కోహెడ(హుస్నాబాద్‌): చెక్‌డ్యాంలో సరదాగా ఈత దిగి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలోని పొరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకొంది. ఘటనకు సంబంధించిన స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోహెడ మండలం పొరెడ్డిపల్లి గ్రామానికి ఎలుక ప్రశాంత్‌(21), డబే కుమారస్వామి(19)బావ బావమరుదులు. ఇద్దరు ఇంటర్మీడియట్‌ చదివి హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రశాంత్‌ తండ్రి కనకయ్య పొలం వద్ద మోటరు పని చేయడం లేదని కొడుకును హైదరాబాద్‌ నుంచి రామన్నాడు.

దీంతో ప్రశాంత్, కుమార స్వామితోపాటు మరో ముగ్గురు స్నేహితులు మంగళవారం ఉదయం గ్రామానికి వచ్చారు. తమ వ్యవసాయ భావి వద్ద మోటరు రిపేర్‌ చేసి బావి సమీపంలోని చెక్‌డ్యాం వద్దరు వచ్చారు. దీంతో సరదాగా ఒకరి తర్వాత ఒకరు నీటిలో దిగారు. లోతు గమనించిన ముగ్గురు యువకులు బయటకు వచ్చారు. అంతలోపే ప్రశాంత్, కుమారస్వామి నీటిలో మునిగిపోయారు. వెంటనేరా ముగ్గురిలో ఒకరైన విజయ్‌కుమార్‌ అనే యువకుడు ప్రశాంత్, కుమారస్వామి మునిగిపోయిన విషయాన్ని 108కు, పోలీసులకు, ప్రశాంత్‌ తండ్రి కనకయ్యకు సమాచారం అందించి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసి అక్కడి నుంచి ముగ్గురు వెళ్లిపోయారు.

వెంటనే ఏసీపీ మహేందర్, సీఐ రఘుపతిరెడ్డి, ఆర్‌డీఓ జయచంద్ర రెడ్డి, తహసీల్దార్‌ రుక్మిని సంఘటన స్థలానికి చేరుకున్నారు. బస్వాపూర్‌ నుంచి ఈత వచ్చిన వారిని రప్పించి మునిగిన యువకులు మృతదేహాలను బయటకు తీశారు. నీట మునిగి మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. ఇద్దరు వరుసకు బావ, బావమరుదులు కావడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రశాంత్‌ పొరెడ్డిపల్లి గ్రామం, కుమారస్వామిది దులి్మట్ట గ్రామం ఇద్దరి మృతదేహాలకు శవ పరీక్ష నిమిత్తం హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top