తుది మెరుగుల్లో ధన్వంతరి గణపతి | Khairatabad Ganesh Statue Ready For Celebration | Sakshi
Sakshi News home page

తుది మెరుగుల్లో ధన్వంతరి గణపతి

Aug 14 2020 8:53 AM | Updated on Aug 14 2020 8:53 AM

Khairatabad Ganesh Statue Ready For Celebration - Sakshi

ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌లో ప్రతియేటా ఏర్పాటు చేసే గణనాథుడిని ఈసారి కోవిడ్‌ నేపథ్యంలో తొమ్మిది అడుగులకే పరిమితం చేసిన విషయం విదితమే. వ్యాధులను నయం చేసే ధన్వంతరి అవతారంలో ఈసారి గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణను ఎదుర్కోవడంలో సాయం చేస్తాడనే విశ్వాసంతో ఈ ఏడాది స్వామివారిని ధన్వంతరి గణపతిగా రూపొందిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గణేశ్‌ విగ్రహాన్ని ఈసారి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా మట్టితో తయారు చేస్తున్నారు. వినాయకుడి తయారీ తుది దశకు చేరుకున్నట్లు వారు తెలిపారు. వినాయకుడికి ఒకవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతీదేవి విగ్రహాలను కూడా మట్టితోనే తయారు చేస్తున్నామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement