సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం..!

Kcr All Party Meeting End Prepare Guidelines For Cm Dalit Empowerment Scheme Provides 10 Lakhs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఆదివారం రోజున జరిగిన అఖిలపక్షభేటి ముగిసింది. సామాజికంగా, ఆర్ధికంగా దళితులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణలో సీఎం దళిత సాధికారత పథకం ద్వారా దళితులకు నిధులు కేటాయించనున్నారు. ఒక్కో యూనిట్‌కి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించనున్నారు.

నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున 10వేల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. సుమారు రూ.1200 కోట్లతో  సీఎం దళిత సాధికారిత పథకం ప్రారంభంకానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో సమిష్ఠి నిర్ణయాన్ని తీసుకున్నారు.

చదవండి: సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం: కేసీఆర్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top