ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్నారా?.. ట్రాఫిక్‌ రూల్స్‌ మారాయ్‌.. కొత్త స్పీడ్‌ లిమిట్స్‌ ఇవిగో

Hyderabad ORR New Traffic Rules Speed Limit Guidelines Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది సైబరాబాద్ పోలీస్‌ శాఖ. పైగా కొత్త రూల్స్‌ నేటి నుంచి(జులై 31వ తేదీ నుంచి) అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. 

లైన్ 1 అండ్ 2ల్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్లొచ్చు. ఆ మధ్య స్పీడ్‌ లిమిట్‌ని అనుమతిస్తారు. ఈ లైన్లలో కనిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్ల చొప్పున ఉండొచ్చు. అలాగే.. లైన్ 3 అండ్ 4 లో గరిష్టంగా గంటకు 80, కనిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు.   ORRలో కనీస వేగం గంటకు 40 కి.మీ. ఇంతకన్నా తక్కువ వాహనాలను ఓఆర్‌ఆర్‌పైకి అనుమతించరు. 

🛣️ ఇక.. లేన్‌ల మధ్య వాహనాల జిగ్-జాగ్ కదలిక అనుమతించబడదు.

🛣️ పై వేగం ప్రకారం లేన్‌లను మార్చాలనుకునే అన్ని వాహనాలు ఇండికేటర్ లైట్లను ఉపయోగించిన తర్వాత మాత్రమే చేయాలి.

🛣️ అలాగే.. లేన్‌లను మార్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

🛣️ ఓఆర్‌ఆర్‌లోని నాలుగు లేన్‌లలో ఏ వాహనం కూడా ఆగకూడదు.

🛣️ ఏ ప్రయాణీకుల వాహనాలు ORRలో ఆపి ప్రయాణికులను ఎక్కించకూడదు.

🛣️ ORRపై టూవీలర్స్‌, అలాగే పాదచారులకు అనుమతి లేదు

ORRలో ప్రయాణాలు సురక్షితంగా సాగేందుకు లక్ష్యం పెట్టుకుంది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌. కొత్త నియమాలు డ్రైవింగ్ క్రమశిక్షణను తీసుకువస్తాయని, అలాగే.. గందరగోళాన్ని తగ్గిస్తాయని, పైగా.. ORRలో ప్రయాణాలు సాఫీగా సాగేందుకు ఉపకరిస్తాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఆ నోటిఫికేషన్‌ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: తెలంగాణ గవర్నమెంట్‌ స్కూళ్లలో వాళ్లకు నో ఎంట్రీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top