సాక్షి,హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో బుధవారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి, సాధారణంగా ప్రతిరోజూ రాత్రి 11 గంటలకు ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి సరీ్వసు బయలుదేరుతుంది. కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ప్రారంభ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, ఫలక్‌నుమా, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి ప్రయాణికుల
డిమాండ్, రద్దీకి అనుగుణంగా ఎంఎంటీఎస్ రైళ్లు బుధవారం రాత్రి ఆలస్యంగా నడవనున్నాయని ఆయన పేర్కొన్నారు.


