వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా.. | Hyderabad's Langar Houz Oyo Couple Incident | Sakshi
Sakshi News home page

వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా..!

Jul 4 2026 7:27 AM | Updated on Jul 4 2026 8:45 AM

Hyderabad's Langar Houz Oyo Couple Incident

పాట పాడుతూ క్లబ్‌ డ్యాన్సర్‌ వీడియో కాల్‌.. ఆపై అనుమానాస్పద మృతి   

లంగర్‌హౌస్‌: లంగర్‌హౌస్‌ పరిధిలో ఓ పబ్‌ డ్యాన్సర్‌ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఆమెను ప్రియుడే హత్య చేశాడా? లేక ఆత్మహత్యకు పాల్పడిందా? అనే కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా.. అంటూ స్నేహితురాలి సోదరుడికి సరదాగా ఫోన్‌ చేసిన మహిళ.. అనంతరం హోటల్‌ గదిలో ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ వెంకటరాములు తెలిపిన వివరాల ప్రకారం.. మూసా»ౌలికి చెందిన రేణుక (28)కు పదేళ్ల క్రితం వివాహమైంది. మూడేళ్ల అనంతరం దంపతులు విడిపోయారు. దీంతో తన 8 ఏళ్ల కుమారుడితో కలిసి ఆమె తల్లిదండ్రులతో నాలుగేళ్లుగా బోరబండలో నివసిస్తోంది. జేఎన్టీయూ పరిధి మంజీరా మాల్‌లోని ఓ పబ్‌లో రేణుక డ్యాన్సర్‌గా పని చేస్తోంది. మూడు నెలలుగా కూకట్‌పల్లిలోని తోటి డ్యాన్సర్‌ సత్య, ఆమె సోదరుడు బన్నీతో కలిసి ఉంటోంది. 
 
ప్రియుడితో కలిసి వెళ్లి..  
బుధవారం సాయంత్రం మంజీరా మాల్‌లోని పబ్‌కు వెళ్లిన రేణుక గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గోల్కొండకు చెందిన ప్రియుడు ఫరూఖ్‌ (36)తో కలిసి లంగర్‌హౌస్‌లోని హోటల్‌ గ్రాండ్‌ వచ్చింది. వీరిద్దరికీ పబ్‌లో ఆరు నెలల క్రితం పరిచయమై దగ్గరయ్యారు. కాగా.. గురువారం రాత్రి 10.40 గంటలకు హోటల్‌ నుంచి బయటకు వెళ్లిన ఫరూఖ్‌ ఆ తర్వాత మరోసారి వచ్చి వెళ్లాడని, రేణుక అప్పటికీ హోటల్‌లోనే ఉందని హోటల్‌ నిర్వాహకులు తెలిపారు.  

బుధవారం వెళ్లిన రేణుకను ఇంటికి వస్తున్నావా అని స్నేహితురాలు సత్య, ఆమె సోదరుడు బన్నీ ఫోన్‌ చేశారు. రేణుక తన ఫోన్‌ టచ్‌ పని చేయట్లేదని డాటా కోసం తన మెయిల్‌ ఐడీ చెప్పాలని వీరి స్నేహితుడు రాజేష్‌ కు ఫోన్‌ చేస్తే రేపు చెబుతా అంటున్నాడని వాపో యింది. బన్నీ ఆమెతో మాట్లాడుతూ.. ‘అక్కా.. బాధపడకు అన్నీ రికవరీ చేసి ఇస్తాను. కానీ తనకు పార్టీ కావాలి’ అని చెప్పాడు. ఇంతలో సత్య మాట్లాడుతూ.. తన ప్రియుడు సాయి వేరే పెళ్లి చేసుకుంటున్నాడు. 

అతని మాట విని ఫరూఖ్‌ నిన్ను (రేణుక)కూడా వదిలేస్తాడేమో’ అని చెప్పింది. కాగా సాయి, ఫరూఖ్‌లు మాట్లాడుకోకుండా వారి ఫోన్‌ నంబర్లు బ్లాక్‌ చేయాలని రేణుక ముందే ప్లాన్‌ చేసుకొని వచి్చంది. హోటల్‌లో ఫరూఖ్‌ ఫోన్‌ రేణుకకు ఇవ్వకపోవడంతో వీరి మ«ధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఇంతలో ఫోన్‌ స్పీకర్‌ ఆన్‌చేసి రేణుకతో బన్నీ మాట్లాడుతూ.. అక్క సత్య పుట్టిన రోజు శుక్రవారం రాత్రి పార్టీ ఇస్తానని చెప్పాడు.  ఇంతలో సత్యకు వేరే కాల్‌ రావడంతో ఆమె ఫోన్‌లో మాట్లాడ సాగింది. తాను మాట్లాడుతుంటే తమ్ముడికి ఫోన్‌ ఇచ్చి నువ్వు వేరే ఫోన్‌ మాట్లాడతావా? నేను ఉరి వేసుకొని చనిపోతానంటూ అని సరదాగా బెదిరించింది. ‘చావవే.. చస్తే మాకు నీ శని పోతుంది’ అంటూ సత్య బదులిచి్చంది.

కొద్ది గంటల్లోనే..
తాను రిసార్ట్‌లో మామిడితోటలో ఎంజాయ్‌ చేస్తున్నానంటూ.. నన్ను చావు అని అన్నావుగా అందుకే నేను చస్తున్నా అంటూ రేణుక వీడియో కాల్‌ చేసి ఫ్యాన్‌కు చున్నీ కట్టి ఉరి వేసుకుంటున్నా అని సత్య, బన్నీకి చూపించింది. గురువారం అర్ధరాత్రి ఒంటి గంటకు హోటల్‌ సర్వర్‌ అటుగా వెళ్తూ ఫరూఖ్, రేణుక ఉన్న 1611 నంబరు గది తలుపు తెరిచి ఉండటంతో చూశాడు. రేణుక ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. రేణుకను ఫరూఖ్‌ హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.  ఫరూఖ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేణుకది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement