పాము కాటుకి నాటు కోడి వైద్యం, ఒక్క ప్రాణం పోలేదు.. ఎక్కడంటే..

Hen Treatment For Snake Bite In khammam District - Sakshi

సాక్షి, ఖమ్మం: జిల్లాలోని బోనకల్ మండలం కలకోట గ్రామంలో పాము కాటు గురైన వారు నాటు కోడి వైద్యం చేయించుకోవడం తాజాగా వైరల్‌గా మారింది. కలకోట గ్రామానికి చెందిన తోటపల్లి సురేష్ పదేళ్ల నుంచి నాటుకోడి వైద్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు  పాము కాటు గురైన 300 మందికి నాటు కోడి వైద్యం చేశాడు. అయితే పాముకాటుకి కోడి వైద్యం చేయడం వల్ల ఎవరూ కూడా ప్రాణాలు కోల్పోలేదని ఆయన చెబుతున్నారు. పాము కాటు గురైన వారు గంటన్నరలోపు వస్తేనే లాభం ఉంటుందని అంటున్నారు.

కాగా పాము కరిచిన వ్యక్తికి ముందుగా గాయాన్ని గుర్తించి అక్కడ నాటు కోడి మలవిసర్జన ద్వారాన్ని అదిమి ఉంచుతారు. దీంతో మలద్వారం నుండి విషాన్ని పీల్చుకొని కోడి చనిపోతుంది. అలా ఆ విషం పూర్తిగా తొలగిపోయే వరకు గాయం వద్ద వరుసగా నాటు కోళ్లు పెడుతూనేవుంటారు. ఎప్పుడైతే కోడి చనిపోవడం ఆగిపోతుందో అప్పుడు పూర్తిగా విషం తొలగిపోయినట్లు లెక్కిస్తారు. కాటు వేసిన పాము తీవ్రతను బట్టి 5 నుంచి 15 కోళ్ల వరకు విషం తీయడానికి ఉపయోగిస్తుంటారు. చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో పాము కాటు గురైన వారు నాటుకోడి వైద్యాన్నే ఆ‍శ్రయిస్తున్నారు.
చదవండి: నార్సింగిలో బైక్‌ను ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి

వైద్యుల హెచ్చరిక
మరోవైపు వైద్యులు మాత్రం నాటు వైద్యాన్ని విశ్వసించరాదని సూచిస్తున్నారు. నాటు కోడి వైద్యంతో సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాకుండా కొన్ని సార్లు ప్రాణాలమీదకు కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. పాము కాటుకి గురైతే బాధితుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని చెప్తున్నారు.
చదవండి: కోరుకున్న ఉద్యోగం రాలేదు, ఏజెన్సీ మోసం.. రెండు నెలలుగా..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top