హరితహారం: ఎమ్మెల్యే నాటిన మొక్కలు తినేసిందని.. | Goat Eating Saplings Planted Under Harithaharam Scheme | Sakshi
Sakshi News home page

హరితహారం: ఎమ్మెల్యే నాటిన మొక్కలు తినేసిందని..

Jul 3 2021 4:17 AM | Updated on Jul 3 2021 6:25 PM

Goat Eating Saplings Planted Under Harithaharam Scheme - Sakshi

సాక్షి, కొల్లాపూర్‌: హరితహారంలో భాగంగా గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 7వ వార్డులో మొక్కలు నాటారు. కాసేపటికే కొన్ని మొక్కలను ఓ మేక తినేసింది. దీంతో మున్సిపల్‌ సిబ్బంది దాన్ని పట్టుకొని కొత్త గ్రంథాలయ భవనం వద్ద ఇనుప జాలీలో బంధించారు. జరిమానా చెల్లించి తీసుకెళ్లాలని యజమాని రంగస్వామికి కబురంపారు. శుక్రవారంమేకను విడిపించుకునేందుకు రంగస్వామి రాగా అధికారులు లేరు. ఈలోగా విషయం సోషల్‌మీడియాకు ఎక్కడంతో శుక్రవారం సాయంత్రం అధికారులు మేకను విడిచిపెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement