పదోన్నతులు ఇవ్వాలి.. జాబ్‌చార్ట్‌ ప్రకటించాలి 

Give Promotions To Revenue Employees Immediately: Vanga Ravinder Reddy - Sakshi

ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి విజ్ఞప్తి 

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ ఉద్యోగులకు తక్షణమే పదోన్నతులు ఇవ్వాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవా సంఘం (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ఉద్యోగుల జాబ్‌చార్ట్‌ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట లో ట్రెసా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరువందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇచ్చినప్పటికీ.. రెవెన్యూ శాఖలో మాత్రం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు, ఇతరత్రా పలు అంశాలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించారు. రవీందర్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, పూల్‌సింగ్, రాజ్‌కుమార్, రియాజుద్దీన్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, యాదగిరి, ఎల్‌బీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 

తీర్మానాలివే.. 
కేడర్‌ స్ట్రెంగ్త్‌ వెంటనే నిర్ధారించి అన్ని తహసీల్‌ కార్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలి. 
సుదూర జిల్లాలకు పోస్టింగులు ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రొబేషనరీ నాయబ్‌ తహసీల్దార్లను ముఖ్యంగా మహిళా ఉద్యోగినులను వారి ఆప్షన్ల ప్రకారం జిల్లాలకు కేటాయించాలి 
ఉద్యోగుల బదిలీల్లో నూతన జోనల్‌ విధానం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. దీర్ఘకాలంగా ఒకే ప్రాం తంలో పని చేస్తున్న తహసీల్దార్లు, ఇతర ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు బదిలీలకు అనుమతించాలి 
వీఆర్వోలను రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేయాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top