
సాక్షి, హైదరాబాద్: రహదారుల నిర్మాణాలకు సంబంధించి అధికార యంత్రాంగం సమన్వయం తో పనిచేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 181 రహదారుల నిర్మాణం.. వాటి అనుమతుల వేగవంతంపై అటవీ, రోడ్లు, భవనాల శాఖల అధికారుల సమన్వయ సమావేశం శనివారం అరణ్యభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె అధికారులకు వివిధ అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు. రాష్ట్ర పరిధిలో పూర్తి స్థాయి రోడ్ నెట్ వర్క్, కొత్త జాతీయ రహదారులు, వ్యూహాత్మక ఎలివేటెడ్ రోడ్ కారిడార్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు.
అన్ని రకాల అనుమతుల సాధన కోసం డెడ్ లైన్లు పెట్టుకుని పనిచేయాలని, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం జిల్లా స్థాయి అధికార యంత్రాంగంతో భూ సేకరణ విషయమై సమన్వయం చేసుకోవాలని రెండు శాఖల అధికారులను ఆదేశించారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ ) ఆర్.శోభ మాట్లాడుతూ ఆయా రహదారులకు అనుమతుల విషయంలో జాప్యాన్ని నివారించేందుకు సంబంధిత పనులు చేస్తున్న ఏజెన్సీలు కూడా సహకరించాలని కోరారు.
అటవీ, పర్యావరణ అనుమతులకు సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కఠిన నిబంధనలను అర్థం చేసుకుని, అం దుకు అనుగుణంగా అనుమతుల పత్రాలను ఆన్‌లైన్‌లో పొందు పర్చాలని అన్నారు. రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాస రాజు మాట్లా డుతూ హైవేల నిర్మాణానికి వీలైనన్ని నిధు లు రాబట్టుకొనే ప్రయత్నం చేయాలని చెప్పారు. సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్త్రీ) ఆర్.ఎం. దోబ్రి యల్, అటవీశాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంతి, ఆర్.అండ్.బీ ప్రత్యేకకార్యదర్శి బి.విజయేంద్ర, సల హాదారు గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.