పంట పోయింది.. గుండె ఆగింది | Sakshi
Sakshi News home page

పంట పోయింది.. గుండె ఆగింది

Published Sat, Jan 8 2022 5:20 AM

Farmer Died Of Heart Attack Due To Loss Of Mirchi Crop In Mahabubabad District - Sakshi

గార్ల: తామర పురుగు ఆశించి మిర్చితోట ఎండిపోవడంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలనే మనో వేదనతో ఓ రైతు గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం చిన్నకిష్టాపురంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మాళోత్‌ భావ్‌సింగ్‌ (40) తన 20 గుంటల భూమితో పాటు మరో 20 గుంటల భూమిని కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాడు.

పంటకు నల్ల తామర పురుగు సోకడంతో పూత కాత రాకపోగా, మొక్కలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే తోటకు రూ.1.5 లక్షలు బయట అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. ఈ క్రమంలో శుక్రవారం తోటకు నీళ్లు కట్టి ఇంటికి వచ్చి గుండెపోటుతో కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి చూసేసరికి మృతి చెందాడు. 

Advertisement
Advertisement