రేపు తెలంగాణలో అన్ని స్కూల్స్‌ బంద్‌ | Holiday To Schools And Colleges In Telangana On Sep 2nd Due To Heavy Rains | Sakshi
Sakshi News home page

Telangana Rains Holiday: రేపు తెలంగాణలో అన్ని స్కూల్స్‌ బంద్‌

Sep 1 2024 1:24 PM | Updated on Sep 1 2024 5:08 PM

Due To Rains Sep 2nd On Holiday To Schools And Colleges In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం కారణంగా మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు అధికారులకు తెలిపారు. అలాగే, అన్ని ప్రభుత్వ విభాగాల్లో సెలవులు రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ప్రజలను మం‍త్రి హెచ్చరించారు. అ‍త్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. 

అలాగే, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు(సోమవారం) ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఓయూ ఇంఛార్జ్‌ వీసీ దానా కిషోర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement