‘మీరు నన్నెలా అరెస్ట్‌ చేస్తారు?’.. సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ డాక్టర్‌ నమ్రత | dr namratha apply bail petition on Srishti Fertility Center Case | Sakshi
Sakshi News home page

‘మీరు నన్నెలా అరెస్ట్‌ చేస్తారు?’.. సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ డాక్టర్‌ నమ్రత

Jul 29 2025 3:48 PM | Updated on Jul 29 2025 3:57 PM

dr namratha apply bail petition on Srishti Fertility Center Case

సాక్షి,హైదరాబాద్‌: అనైతిక సరోగసి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో అయితే తెలంగాణ పోలీసులు తనని ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ నిందితులు సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితురాలు డాక్టర్‌ అట్లూరి నమ్రత తరపు న్యాయవాదులు పిటిషన్‌ వేశారు.

35 ఏళ్ల పాటు సుదీర్ఘ అనుభవం ఉన్న తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలనుండి ఒక్క ఫిర్యాదు కూడా లేదు. నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో.. తెలంగాణ పోలీసులు నాపై కేసులు ఎలా నమోదు చేసి.. అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement