దిశ ఎన్‌కౌంటర్‌ కేసు: లారీ ఓనర్‌ ఆ విషయం చెప్పనేలేదు! ఎన్‌కౌంటర్‌ బాధితుల తరపున వాదనలు

Disha Encounter Case Report Senior Counsel Arguments In TS HC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో.. తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో దిశ ఎన్‌కౌంటర్‌పై సిర్పూర్కర్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఎన్‌కౌంటర్‌కు గురైన బాధితుల తరపున సుప్రీం కోర్టు సీనియర్‌ కౌన్సిల్‌ వృందా గ్రోవర్‌.. తన వాదనలు వినిపించారు.

ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరును కోర్టు దృష్టికి తీసుకొచ్చిన వృందా.. పోలీసులు వెల్లడించిన తీరుపైనా పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు.  పోలీస్ కస్టడీ లో ఉన్న నలుగురు నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ పేరుతో ఎన్ కౌంటర్ చేశారని ఆమె వాదించారు. సీసీ టివీలో లారీను చూసి  మొదట గుర్తు పట్టింది ఓనర్ శ్రీనివాస్ రెడ్డి అని పోలీసులు తెలిపారు. కానీ.. 

కమిషన్‌ ముందు శ్రీనివాస్ రెడ్డి ఆ  విషయం చెప్పనే లేదు అని ఆమె పలు అంశాలపైనా అభ్యంతరం వ్యక్తం చేశారామె. ఈ క్రమంలో.. ఇవాళ్టితో ఆమె వాదనలు ముగిశాయి. ఇక.. మిగిలింది ప్రభుత్వం తరపున వాదనలే. దీంతో తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top