నాటు కోడి.. భలే క్రేజీ

Desi Hen Business Rises in Tribal Villages Warangal - Sakshi

ధర ఎక్కువైనా తగ్గని డిమాండ్‌

ఆరోగ్యానికి మేలు చేస్తుందనిభావిస్తున్న ప్రజలు

ఇటీవలి కాలంలో చికెన్‌ సెంటర్లలోనూ దేశీ కోడి అమ్మకాల జోరు

పల్లెల నుంచి పట్టణాలకు తరలింపు మారుబేరంతో ఆదాయం పొందుతున్న వ్యాపారులు

మహాముత్తారం : ప్రపంచమంతా కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో చికెన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. లాక్‌డౌన్‌ సమయంలో చికెన్‌ తింటే కరోనా వస్తుందని పుకార్లతో ఆదరణ తగ్గిన విషయం విదితమే. అయితే, ప్రభుత్వం సైతం చికెన్‌ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారం చేయడంతో క్రమక్రమంగా చికెన్‌కు డిమాండ్‌ పెరిగింది. పట్టణాలకే పరిమితమైన కరోనా నేడు అటవీ గ్రామాలకుసైతం విస్తరించింది. దీంతో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రజలంతా మాంసాహారం వినియోగంపై దృష్టి సారించారు. సాధారణంగా చికెన్‌ సెంటర్‌లో లభించే బాయిలర్‌ను మాత్రమే ఎక్కువ సంఖ్యలో వినియోగించేవారు.

కొవ్వుకు చెక్‌.. రుచికి బెటర్‌
బాయిలర్‌ చికెన్‌ కంటే నాటు కోడి తింటే మరింత మంచిదన్న ప్రచారంతో ఇటీవల కాలంలో నాటుకోళ్లకు గిరాకీ పెరిగింది. బాయిలర్‌ కోడి మాంసం రుచి ఉండదు. ఇక మేక మాంసం తింటే కొవ్వు పెరుగుతుంది. ప్రస్తుతం చేపలు దొరకడం కష్టమే. మరి ఏమి తింటే మంచిదనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో తింటే నాటుకోడి కూరనే తినాలని ఆసక్తి పెరుగుతోంది. మిగతా మాంసాలతో పోలిస్తే నాటుకోడి కూర రుచిగా ఉండడం ఓ కారణం. ఒకప్పుడు ఇంటింటికీ కోళ్లు ఉండేవి. చుట్టాలు వచ్చినా, పండుగలు వచ్చినా నాటుకోడి కూర వండేవారు. రానురాను పల్లెల్లో కోళ్ల పెంపకం తగ్గిపోయింది. కోళ్ల వల్ల పెంట, వాసన తదితర ఇబ్బందులను గమనించిన పల్లె జనం సైతం కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. ఇదే క్రమంలో బాయిలర్‌ కోళ్లు రావడం ప్రతీ ఊరిలో చికెన్‌ సెంటర్లు వెలియడంతో జనం ఆ చికెన్‌ వైపే మొగ్గు చూపారు. పైగా బాయిలర్‌ చికెన్‌ వండటం సులభం కావడం, ఎప్పుడంటే అప్పుడు దొరకడంతో జనం నాటుకోడి ఊసెత్తడం మానేశారు.

మళ్లీ ఇప్పుడు..
ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆరోగ్యంపై జాగ్రత్త పెరుగుతోంది. అతిగా మందులు వాడి పెంచే ఆహారం జోలికి పోవద్దన్న ఆలోచన ఎక్కువైంది. ఈ క్రమంలోనే బాయిలర్‌ చికెన్‌ తినద్దన్న ప్రచారం మొదలైంది. తింటే మటన్‌ తినండి తేదంటే నాటుకోడి కూర తినండి అని పలువురు ఆహార నిపుణులు సూచించడం, చేపలు మంచివే కాని అవి టైంకు దొరకకపోవడం కొందరికి నచ్చకపోవడంతో నాటు కోడి కూరవైపు మొగ్గు చూపడం ఆరంభమైంది. అయితే, బాయిలర్‌ కోడి సాధారణంగా కిలో రూ.100 నుంచి రూ.150 ఉంటుంది. నాటుకోడి రూ.350 నుంచి రూ.550 వరకు ఉంటుంది. పండుగల సమయంలో ఈ ధర మరింత ఎక్కువవుతుంది. అయినా నాటుకోళ్లపై క్రేజ్‌ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడంలేదు. ప్రత్యేక విందులు జరిగే ప్రాంతాల్లో నాటుకోళ్లను తీసుకెళ్తున్నారు.

చికెన్‌ సెంటర్లలోనూ అమ్మకం..
ఒకప్పుడు నాటుకోడి మాంసం దొరకడం గగనంగా ఉండేది. ఆ కోళ్లను తెలిసిన వారి ఇళ్ల నుంచి కొనుగోలు చేసేవారు., దీనిని డ్రెసింగ్‌ చేయడం కష్టంగా భావించే వారు. పైగా దానిని కాల్చితేనే బాగుంటుందన్న అభిప్రాయం. ఇంత కష్టం ఎందుకని జనం దాని జోలికి పోవడం మానేశారు. కానీ ఇప్పుడు చికెన్‌ సెంటర్లలోనే దానిని కోసి డ్రెసింగ్‌ చేసి కాల్చి ఇస్తున్నారు. మటన్‌తో పోలిస్తే ధర తక్కువ పైగా రుచి, పోషకాలు కూడా ఎక్కువే. అందుకని ఈజీగా దొరుకుతున్న నాటుకోడి మాంసంపై జనం మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా నాటుకోడి ఎలాంటి మందులు అవసరం లేకుండా పెరుగుతోంది. పైగా మాంసం గట్టిగా రుచిగా ఉంటుంది. కొవ్వు సమస్య ఉండదు. తొందరగా జీర్ణమవుతుంది. ఆరోగ్యానికి మేలు తప్ప కీడు చేయదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు నాటుకోళ్లను దళారులు పల్లెల నుంచి పట్టణాలకు తరలిస్తున్నారు. ప్రతీ రోజు దళారులు అటవీ గ్రామాల్లో ద్విచక్రవాహనాలపై తిరుగుతూ నాటుకోళ్లు కొంటాం అంటూ.. కేజీ రూ.180కి కొనుగోలు చేసి వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్‌ తదితర పట్టణప్రాంతాలకు తరలించి రూ.350 నుంచి రూ.500 వరకు చికెన్‌ సెంటర్‌ యజమానులకు విక్రయిస్తున్నారు. దీంతో పండుగల సమయంలో గ్రామాల్లో నాటుకోళ్లకు కొరత ఏర్పడుతోంది.

తింటే నాటుకోడే తినాలి..
సాధారణ చికెన్‌తో పోలిస్తే నాటుకోడి కూరే రుచిగా ఉంటుంది. ఇప్పటికి మా ఇంటికి బంధువులు వస్తే నాటుకోడి కూర వండాల్సిందే. ఇది మన తెలంగాణ సంప్రదాయం కూడా. వచ్చిన బంధువులకు నాటుకోడి కూర వండి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.– ఓలపు శంకర్‌పటేల్, కిష్టాపూర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

23-09-2020
Sep 23, 2020, 05:36 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వేళ కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు కాసులకు కక్కుర్తి పడిన విషయం వాస్తవమేనని టాస్క్‌ఫోర్స్‌ నిర్ధారణకు వచ్చినట్లు...
23-09-2020
Sep 23, 2020, 03:58 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోజూ నమోదవుతున్న కోవిడ్‌ కేసుల కంటే డిశ్చార్జ్‌ అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24...
23-09-2020
Sep 23, 2020, 03:53 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వాల్సిన ఆక్సిజన్‌ను సమకూర్చుకోవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో నిలిచింది. రాష్ట్రంలో అవసరమైనదాని...
22-09-2020
Sep 22, 2020, 21:26 IST
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిన డ్రాగన్‌ దేశంపై...
22-09-2020
Sep 22, 2020, 20:15 IST
ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,62,376. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 71,465.
22-09-2020
Sep 22, 2020, 19:26 IST
జరగాల్సిన నష్టం జరిగి పోయాక రాత్రి పది గంటల నుంచి ఆంక్షలు విధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుంది?
22-09-2020
Sep 22, 2020, 17:56 IST
అందుకనే ఇంకా విటమిన్లు, పోషక పదార్థాల కోసం ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది.
22-09-2020
Sep 22, 2020, 16:36 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య భారత్‌లో గణనీయంగా పడిపోతోంది. సెప్టెంబర్‌...
22-09-2020
Sep 22, 2020, 15:53 IST
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లో సైతం రోజురోజుకు అత్యంతగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 90 వేల మందికి...
22-09-2020
Sep 22, 2020, 14:13 IST
ముంబై: బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. మహమ్మారి కరోనా కాటుకు సీనియర్‌ నటి, ప్రముఖ థియేటర్‌ ఆర్టిస్టు ఆశాలత వాగోంకర్‌(79) బలైపోయారు....
22-09-2020
Sep 22, 2020, 14:07 IST
బీజింగ్ : ప్రభుత్వంపై విమర్శలకు చేసినందుకు గాను చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిలియనీర్ రెన్ జికియాంగ్ (69) కు...
22-09-2020
Sep 22, 2020, 10:36 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇక గడచిన 24...
22-09-2020
Sep 22, 2020, 09:05 IST
అమలాపురం టౌన్‌ : ఇప్పటి వరకూ కరోనాతో ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు రూ.వేలల్లో డిమాండ్‌ చేసిన...
22-09-2020
Sep 22, 2020, 04:14 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 24 గంటల్లో 10, 502 మంది...
22-09-2020
Sep 22, 2020, 03:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్, జూలై నెలల్లో ఓ మోస్తరుగా నమోదైన...
21-09-2020
Sep 21, 2020, 20:07 IST
సాక్షి, విజయవాడ : కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో జిల్లాలో కొత్త‌గా 10 కంటైన్‌మెంట్ జోన్ల‌ను క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ ప్ర‌క‌టించారు. ఎ.కొండూరు...
21-09-2020
Sep 21, 2020, 19:44 IST
పది రోజుల్లో పది వేల పడకల ఆస్పత్రిని నిర్మించి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన చైనా, ఇప్పుడు అంతకంటే ఆశ్చర్యపరిచే మహత్కార్యానికి...
21-09-2020
Sep 21, 2020, 19:08 IST
గుర్రు పెడుతూ నిద్రపోయే వారిలో కండరాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు కొన్ని క్షణాలపాటు తాత్కాలికంగా శ్వాసనాళంలోకి గాలి సరిగ్గా పోదని, ఫలితంగా...
21-09-2020
Sep 21, 2020, 17:27 IST
త 24 గంటల్లో 10,502 మంది కోవిడ్‌ రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,51,821 మంది వైరస్‌ను జయించారు.
21-09-2020
Sep 21, 2020, 16:48 IST
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం ఖర్చులను క్రమబద్దీకరించేందుకు దేశంలోని దాదాపు 15 రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగినప్పటికీ ముక్కుకు తాడేయలేక...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top