తల్లికి టీకా వేసిన కూతురు

Daughter do Vaccine for her Mother - Sakshi

కేసముద్రం: ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి వైద్యులు, వైద్యులకు సిబ్బంది కరోనా వ్యాక్సిన్‌ ఇస్తుండటం మనకు తెలిసిందే. అయితే మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం ఆసక్తికరమైన సంఘటన జరిగింది. తొలిదశలో మహమూద్‌పట్నం అంగన్‌వాడీ సెంటర్‌లో ఆయాగా పనిచేస్తున్న ఎల్లమ్మ పేరు జాబితాలో ఉంది. ఆమె పేరు రావడంతో అదే పీహెచ్‌సీలో పని చేస్తున్న ఎల్లమ్మ కూతురు, ఏఎన్‌ఎం యాకమ్మ విధుల్లో ఉండటంతో స్వయంగా తన తల్లికి టీకా వేశారు. దీంతో అక్కడున్న సిబ్బంది చప్పట్లు కొట్టి అభినందించారు.

కాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం మూడు రోజుల్లో 69,625 మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మళ్లీ రేపు టీకాల పంపిణీ సాగనుంది. టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతుండడంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్రాన్ని అభినందించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top