
పుస్తక ప్రదర్శనలో సీఎస్ సోమేశ్, డీజీపీ
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ ఆలోచనలను, భావజాలాన్ని ఆకళింపు చేసుకొనేందుకు పుస్తక ప్రదర్శన ఎంతో దోహదం చేస్తుందని సీఎస్ సోమేశ్‌కుమార్ అన్నారు. ‘మంచి పుస్తకం చెంతన ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే‘.. అన్న గాంధీ సూక్తిని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ ఇండోర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి సహా ఇతర సీనియర్ అధికారులతో కలసి సీఎస్ శనివారం పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాంధీ చరఖాను, చేనేత మగ్గాన్ని, ఎద్దు గానుగ యంత్రాన్ని తిలకించారు.