మరణించిన వ్యక్తికి.. బూస్టర్‌ డోస్‌

Covid 19: Booster Dose Message Received Deceased Person In Mahabubabad - Sakshi

బయ్యారం(వరంగల్‌): మరణించిన వ్యక్తికి బూస్టర్‌ డోస్‌ వేసినట్లు ఆరోగ్యశాఖ నుంచి మెసేజ్‌ వచ్చింది. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. మండల కేంద్రానికి చెందిన బొందలపాటి కృష్ణయ్య(87) అనారోగ్యంతో గత నెల 28న మృతి చెందాడు. అంతకుముందు కృష్ణయ్య సంగారెడ్డి జిల్లా పరిధిలో నివాసం ఉండేవారు.

కోవిడ్‌ టీకా రెండు డోసులూ సంగారెడ్డి జిల్లా బానూర్‌ పీహెచ్‌సీ పరిధిలో వేసుకున్నాడు. అయితే ఈనెల 17న క్రిష్ణయ్యకు బూస్టర్‌డోస్‌ వేసినట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యానికి గురై ఆన్‌లైన్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ పరిశీలించారు. అందులోనూ బూస్టర్‌డోస్‌ వేసినట్టు ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top