భారమైన క్రెడిట్‌ కార్డు బిల్లు.. దంపతుల ఆత్మహత్య

Couple Suicide Due To Credit Card Bill Burden - Sakshi

సాక్షి,మేడ్చల్‌: జిల్లాలోని కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ  ఘటన చోటు చేసుకుంది. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కీసర గ్రామానికి చెందిన సురేశ్‌ కుమార్‌ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇటీవల అప్పుల భారం ఎక్కువ కావడంతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పిల్లలను బంధువుల ఇంటికి పంపించి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి.. కిస్‌వా జువెల్లరీ దోపిడీ కేసు కొలిక్కి

whatsapp channel

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top