Telangana: కరోనా.. కౌంట్‌‘డౌన్‌’

Coronavirus Cases Drastically Decreased In Telangana Report Says - Sakshi

రాష్ట్రంలో తగ్గుతున్న వైరస్‌ పాజిటివిటీ రేటు..

3 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌లోనే కేసులు

మరో 3 జిల్లాల్లో 25లోపే నమోదవుతున్న వైనం

 8 జిల్లాల్లోనే రోజుకు వందకుపైగా కేసులు

వైరస్‌ వ్యాప్తి తగ్గుతోందని వైద్యశాఖ అంచనా

25 జిల్లాల్లో భారీగా తగ్గిన మైక్రో కంటైన్మెంట్‌ జోన్లు

పాజిటివిటీ రేటు ఆధారంగా లాక్‌డౌన్‌ మినహాయింపులు!  

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.47% ఉందని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1,38,182 పరీక్షలు నిర్వహించగా, 1.49 శాతంగా పాజిటివిటీ రేటు నమోదైంది.

గత వారం రోజులుగా లక్షకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. ఆదిలాబాద్, కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో దాదాపు వారం రోజులుగా ఇదే తరహాలో కేసులు నమోదవుతుండటం శుభపరిణామం. ఇక మెదక్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లోనూ పాజిటివ్‌ కేసులు పాతి కేసి లోపే వస్తున్నాయి. ప్రస్తుతం 8 జిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతుండటాన్ని చూస్తుంటే వైరస్‌ వ్యాప్తి తీవ్రత తగ్గుతున్నట్లు వైద్య శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వల్ల జనసంచారం తగ్గడంతో కరోనా వ్యాప్తి తగ్గినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జీహెచ్‌ఎంసీ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో మాత్రం నిత్యం వందేసి చొప్పున కేసులు నమోదవుతున్నాయి. 

పాజిటివిటీ రేటును మరింత తగ్గించేలా.. 
రాష్ట్రంలో శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 25.2 శాతం పాజిటివిటీ రేటు నమోదుకాగా ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌ జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5–10 శాతం వరకు నమోదైంది. కరీంనగర్‌ జిల్లాలో మధ్యస్థంగా పాజటివిటీ రేటు 4–5 శాతం నమోదవుతూ క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో వచ్చే వారం రోజులు లాక్‌డౌన్‌ మరింత పక్కాగా అమలు చేయడం, మరో దఫా ఫీవర్‌ సర్వేతోపాటు టెస్ట్‌లు భారీగా పెంచి పాజిటివిటీ రేటును మరింత తగ్గించేలా నియంత్రణ చర్యలను ప్రభుత్వం చేపట్టనుంది. 

తక్కువ కేసులున్న జిల్లాల్లో అన్‌లాక్‌? 
రాష్ట్రవ్యాప్తంగా వచ్చే వారం రోజుల్లో నమోదయ్యే కరోనా పాజిటివ్‌ కేసుల ఆధారంగా వివిధ జిల్లాలవారీగా లాక్‌డౌన్‌ మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పాజిటివిటీ శాతం అత్యల్పంగా నమోదయ్యే జిల్లాల్లో ఈ మినహాయింపులు ఉండొచ్చని తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో లాక్‌డౌన్‌ మినహాయింపు సమయం పెంపు వంటి వెసులుబాట్లను ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. 

మైక్రో కంటైన్మెంట్‌ జోన్లు 205... 
రాష్ట్రంలో మైక్రో కంటైన్మెంట్‌ జోన్లు ప్రస్తుతం 205 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మహబూబాబాద్‌లో 59, నల్లగొండలో 44, సిద్దిపేటలో 11, వరంగల్‌ రూరల్‌లో 12, యాదాద్రి భువనగిరిలో 10 ఉన్నాయి. మిగతా 14 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌లోనే మైక్రో కంటైన్మెంట్‌ జోన్లు ఉండగా 14 జిల్లాల్లో మైక్రో కంటైన్మెంట్‌ జోన్లను పూర్తిగా ఎత్తేశారు. 

లక్ష దాటిన పరీక్షలు... 
రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం భారీగా పెంచింది. ఇదివరకు రోజుకు 60 వేల వరకు టెస్టులు నిర్వహించగా... ప్రస్తుతం ఆ సంఖ్య 1.38 లక్షలకు పెరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గత వారం రోజులుగా నిత్యం లక్షకుపైగా పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా తీవ్రత తగ్గుతున్న సమయంలో పరీక్షలు ఎక్కువ చేస్తే క్షేత్రస్థాయి పరిస్థితిపై అంచనా వస్తుందని భావించిన యంత్రాంగం... ఈ దిశగా కీలక అడుగులు వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటిన్నర శాతం కంటే తక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 

కొత్త కేసులు 2,070... 
రాష్ట్రంలో తాజాగా 2,070 కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1,38,182 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1.49 శాతం పాజిటివిటీ నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5,89,734 మంది కరోనా బారినపడగా వారిలో 5,57,162 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 29,208 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా ప్రభావంతో తాజాగా 18 మంది మరణించగా ఇప్పటివరకు మరణాల సంఖ్య 3,364కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.57 శాతం ఉండగా రికవరీ రేటు 94.47 శాతం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.  

వారం రోజుల్లో నియంత్రణలోకి.. 
రాష్ట్రంలో పాజిటివిటీ రేటు వేగంగా తగ్గుతోంది. కేసుల తీవ్రత ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాం. రాష్ట్ర సరిహద్దులతోపాటు కొన్ని జిల్లాల్లో ఈ వారం రోజులపాటు సూక్ష్మస్థాయి వ్యూహాన్ని అమలు చేస్తాం. వచ్చే వారం రోజుల్లో అన్ని జిల్లాల్లో పరిస్థితి పూర్తిగా కంట్రోల్‌లోకి వస్తుంది. – శ్రీనివాసరావు, వైద్య,ఆరోగ్య శాఖ డైరెక్టర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

05-06-2021
Jun 05, 2021, 22:06 IST
ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.  కరోనా కష్టసమయంలో ఢిల్లీ ప్రజలకు ఉపయోగపడే డోర్‌ డెలివరీ...
05-06-2021
Jun 05, 2021, 19:31 IST
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర విమానయానా శాఖా మంత్రి హర్దీప్ సింగ్‌ పూరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో...
05-06-2021
Jun 05, 2021, 18:53 IST
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన పీహెచ్‌సీ వైద్యాదికారి ఎన్‌.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారిగా...
05-06-2021
Jun 05, 2021, 17:49 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 88,441 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10,373 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో...
05-06-2021
Jun 05, 2021, 12:17 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్‌తో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం మరో ఊరటనిచ్చింది.  రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ తయారీకి  అతిపెద్ద టీకా...
05-06-2021
Jun 05, 2021, 08:11 IST
సాక్షి, చెన్నై: తెలుగు సినీ చలనచిత్ర పరిశ్రమలో సీనియర్‌ మేకప్‌ చీఫ్‌ సి.మాధవరావుకు సతీవియోగం కలిగింది. ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ (76) కరోనాతో చెన్నైలో...
05-06-2021
Jun 05, 2021, 06:21 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా కోర్టుల పనితీరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సమీక్షించారు. హైకోర్టుల్లో...
05-06-2021
Jun 05, 2021, 06:16 IST
న్యూఢిల్లీ: దేశంలో రెండు నెలలుగా భారీగా కోవిడ్‌ కేసులు పెరగడానికి బి.1.617 వేరియంటే ప్రధాన కారణమని ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 కన్సార్టియం...
05-06-2021
Jun 05, 2021, 06:02 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. గత నెల 4.14 లక్షల వరకు చేరుకున్న పాజిటివ్‌ కేసులు...
05-06-2021
Jun 05, 2021, 05:01 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దాడి ప్రారంభమై సంవత్సరం గడవకముందే దానిపై పోరాటానికి ఆయుధాలను సిద్ధం చేసిన భారతీయ శాస్త్రవేత్తలను ప్రధాన...
05-06-2021
Jun 05, 2021, 04:39 IST
సాక్షి, దామరగిద్ద: కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. గంటల వ్యవధిలోనే తల్లి, కుమారుడు, తండ్రిని బలి తీసుకుంది. నారాయణపేట...
04-06-2021
Jun 04, 2021, 21:20 IST
లండన్‌: భారత్‌లో అత్యంత వేగంగా వ్యాపించిన కొవిడ్ -19 డెల్టా వేరియంట్ (బీ1.617.2) ఇప్పుడు బ్రిట‌న్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఆ దేశంలో...
04-06-2021
Jun 04, 2021, 20:56 IST
చెన్నై : కరోనా వైరస్‌ కారణంగా ఓ తొమ్మిదేళ్ల సివంగి మృత్యువాతపడింది. చెన్నైలోని అరిగ్నర్‌ అన్నా జూలాజికల్‌ పార్కులో గురువారం...
04-06-2021
Jun 04, 2021, 17:56 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్...
04-06-2021
Jun 04, 2021, 17:18 IST
బీజింగ్‌: కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చైనా నుంచే ఈ వైరస్‌...
04-06-2021
Jun 04, 2021, 16:54 IST
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 85,311 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1‌‌0,413 కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
04-06-2021
Jun 04, 2021, 12:03 IST
వ్యాక్సిన్‌ వేయుంచుకున్న వారికి లక్కీ డ్రా రూపంలో విలువైన వస్తువులను అందిస్తోంది.
04-06-2021
Jun 04, 2021, 08:13 IST
సాక్షి, బెంగళూరు: కరోనా రక్కసి మారణహోమం కొనసాగిస్తోంది. కేసులు తగ్గినప్పటికీ మృత్యు బీభత్సం అదుపులోకి రావడం లేదు. గత 24...
04-06-2021
Jun 04, 2021, 05:41 IST
తంగళ్లపల్లి (సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన ముత్తంగి శ్రీనివాస్‌రెడ్డి (45)ది వ్యవసాయ కుటుంబం....
04-06-2021
Jun 04, 2021, 04:55 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారి వల్ల ప్రభావితులైన చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top