ఆగని కరోనా ఉధృతి .. ఆ జిల్లాలో వందల కొద్ది కేసులు..

Corona Virus Latest Update From Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు వందల సంఖ్యలో నమోదువుతున్నా యి. గురువారం ఒక్కరోజే జిల్లాలో 225మంది మ హమ్మారి బారిన పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడలో 39, అనుములలో 26, చౌటుప్పల్‌లో 15, కేతేపల్లిలో 13, శాలిగౌ రారంలో 12, ఆలేరులో 11, పెద్దఅడిశర్లపల్లిలో10, బొమ్మలరామారంలో 10, సంస్థాన్‌నారాయణపురంలో 8, తుంగతుర్తిలో 8, అడవిదేవులపల్లిలో 7, గుండాలలో ఆరుగురికి, కట్టంగూర్‌లో ఆరుగురికి, చింతపల్లిలో ఆరుగురికి, మర్రిగూడెంలో ఆరుగురికి, తిరుమలగిరిలో నలుగురికి, మునుగోడులో నలుగురికి, మోత్కూరులో నలుగురికి, నాంపల్లిలో నలుగురికి, జాజిరెడ్డిగూడెంలో ముగ్గురికి, కొండమల్లేపల్లిలో ముగ్గురికి, ఆత్మకూరు(ఎం)లో ముగ్గురికి, వలిగొండలో ముగ్గురికి, డిండిలో ముగ్గురికి, మద్దిరాలలో ముగ్గురికి, నడిగూడెంలో ఇద్దరికి, పోచంపల్లిలో ఇద్దరికి, భువనగిరిలో ఇద్దరికి, నాగారంలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని వైద్యులు ధ్రువీకరించారు.

కరోనాతో ఇద్దరు మృత్యువాత
చిట్యాల మండలంలోని  వెలిమినేడు గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం మృతి చెందాడు. వివరాలి ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన చిన్నం భిక్షం(72)కు పదిరోజుల క్రితం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐదురోజులపాటు స్థానిక వైద్యుల పర్యవేక్షణలో  హోం కార్వంటైన్‌లోనే ఉన్నారు. అనంతరం భిక్షం ఆరోగ్యం విషమించడంతో ఆయన కుటుంబ సభుయలు మెరుగైన వైద్యం కోసం నల్లగొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. 

తక్కెళ్లపాడులో వృద్ధురాలు..
మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్లపాడులో 70ఏళ్ల వృద్ధురాలు కరోనాతో గురువారం మృతి చెందింది. కాగా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మిర్యాలగూడకు చెందిన గయాస్‌ మిత్ర బృందం సభ్యులు సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.  

చదవండి:  Third Wave: మన పిల్లలు సేఫ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top