స్కై రూట్ ఏరో స్పేస్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ | CM Revanth Reddy At Skyroot Aerospace Program In Shamshabad, Announces Skill University And Educational Upgrades | Sakshi
Sakshi News home page

స్కై రూట్ ఏరో స్పేస్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌

Apr 25 2026 4:44 PM | Updated on Apr 25 2026 4:56 PM

CM Revanth Reddy at Skyroot Aerospace Program In Shamshabad

హైదరాబాద్‌: శంషాబాద్‌లోని జీఎంఆర్‌ ఏరోస్పేస్‌ పార్క్‌లో  స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీకి చెందిన విక్రం-1 రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ..  ‘ఆనంద్ మహీంద్రా బోర్డు చైర్మన్‌గా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఏరో స్పేస్ విభాగం లో కూడా స్కిల్ యూనివర్సిటీ సేవలను వినియోగించుకోవాలి. 

ఏరో స్పేస్ రంగానికి కావాల్సిన మనవరులను యూనివర్సిటీ ద్వారా అందిస్తాం. స్కిల్స్ కు సంబంధించిన అన్ని విభాగాలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధి లోకి తీసుకువస్తాం. స్కిల్స్ యూనివర్సిటీ ని అద్భుతం గా తీసుకువస్తున్నాం. మల్లేపల్లి ఏటీసీ సెంటర్ ని సందర్శించాలి. ఐటీఐలను టాటా గ్రూప్ సహకారం తో ఏటీసీలు గా మారుస్తున్నాం. 

సిలబస్‌ను కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుస్తున్నాం. విద్యా వ్యవస్థను సమూలం గా మారుస్తున్నాం. విద్యా ప్రమాణాలతో పాటు మహులిక సదుపాయాలు పెంచబోతున్నాం. ప్రతి విద్యార్థి పైన లక్షా 8 వేల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెడుతోంది’ అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement