‘తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఉప్పు పాతర వేశారు’ | CM Revanth Reddy Fires on BRS | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఉప్పు పాతర వేశారు’

Jun 28 2026 6:47 PM | Updated on Jun 28 2026 7:09 PM

CM Revanth Reddy Fires on BRS

సాక్షి,నల్గొండ: మూసీలో ఉండే కాలుష్యం కంటే బీఆర్‌ఎస్‌ నేతల కడుపులో ఉండే కంపే ఎక్కువ’ అంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆదివారం నల్గొండలో రూ.13వేల కోట్ల రోడ్ల నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు.

అనంతరం సీఎం రేవంత్‌ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ తలెత్తుకునేలా చేసిన నాయకుడు కోమటిరెడ్డి. త్యాగమంటే ఎలక్షన్‌లు తేవడం, కలెక్షన్లు చేసుకోవడమేనా?. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో త్యాగం చేశారు. తెలంగాణ కోసం ఎంతో మంది బిడ్డలు త్యాగం చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లలోనే వందేళ్లకు సరిపోయే విధ్వసం చేసింది. తెలంగాణ సమాజం బీఆర్‌ఎస్‌ను క్షమించదు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఉప్పు పాతర వేశారు. తెలంగాణ అభివృద్ధిపై శాసన సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇచ్చిన దొడ్డు బియ్యం బర్రెలకు పెట్టుకునేవారు.

ఏడాదికి రూ.16వేల కోట్ల వ్యయంతో సన్న బియ్యం ఇస్తున్నాం. కేసీఆర్‌ తింటున్న సన్న బియ్యాన్నే  ఈ రోజుల పేదలు కూడా తింటున్నారు. పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు.. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. పేదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మీకు కడుపు మంట ఎందుకు? అని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement