నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌ | CM KCR Visits To Yadadri Temple | Sakshi
Sakshi News home page

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

Mar 4 2021 1:19 AM | Updated on Mar 4 2021 1:20 AM

CM KCR Visits To Yadadri Temple - Sakshi

లక్ష్మీనరసింహస్వామి ఆలయ పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌

యాదగిరిగుట్ట: లక్ష్మీనరసింహస్వామి ఆలయ పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ గురువారం యాదాద్రికి రానున్నారు. హెలికాప్టర్‌లో ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు. ముందుగా స్వామివారి పూజలో పాల్గొంటారు. అనంతరం ప్రధానాలయంతో పాటు కొండపైన, కొండకింద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్న, పూర్తయిన, ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు వైటీడీఏ, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో స్వయంభూ స్వామివారి పునఃదర్శనాలపై సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అనితా రాంచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డిలు బుధవారం సాయంత్రం ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement