బుల్లెట్‌ ప్రూఫ్‌తో సీఎం ఛాంబర్‌.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం

CM KCR Inspects Construction of New Telangana Secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న నూతన స‌చివాల‌య పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ప్రస్తుతం ఇంటీరియర్‌ వర్క్స్‌ కొనసాగుతుండగా.. సంక్రాంతికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం ఛాంబర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ను ఏర్పాటు చేశారు.

రాజ్‌పథ్‌ తరహాలో ఫౌంటేన్‌లు, అత్యాధునిక సదుపాయాలతో నూతన సెక్రటరియేట్‌ను నిర్మిస్తున్నారు. సెక్రటేరియట్ కాంపౌడ్ బయట గుడి, మసీదు, చర్చిని నిర్మిస్తున్నారు. మూడు షిఫ్టుల్లో నాలుగు వేల మందితో ప‌నులు శరవేగంగా జ‌రుగుతున్నాయి.  సీఎం కేసీఆర్ పర్యటనలో రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి, ఆర్అండ్‌బీ శాఖ అధికారులతో పాటు త‌దిత‌రులు ఉన్నారు. 

చదవండి: (తెలంగాణలో ఎన్నికల వేడి.. కారు ఫైరింగ్‌.. అనూహ్యంగా ఎదిగిన కమలం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top