ఖమ్మం: నేడు(శుక్రవారం) బాలల దినోత్సవాన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ తల్లిదండ్రులు, స్నేహితుల మధ్య ఆహ్లాదంగా గడపాల్సిన కొందరి బాల్యం మాత్రం చెత్తకుప్పల మాటున మగ్గిపోతోంది. ప్లాస్టిక్, పేపర్లు, ఇనుప కడ్డీలు ఏరుకుని విక్రయిస్తేనే కడుపు నిండే పరిస్థితి కావడంతో ఈ పిల్లలకు పని తప్పడం లేదు. ఖమ్మం మామిళ్లగూడెంలో గురువారం ఈ దృశ్యాలు కనిపించగా.. ఇలాంటి వారు సైతం సంతోషంగా బాలల దినోత్సవం జరుపుకునేలా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని పలువురు కోరారు.


