గుడ్‌న్యూస్.. మరో ఏడాది పాటు రేషన్ బియ్యం ఫ్రీ..!

Center Free Ration Scheme For One More Year State Quota Not Clear - Sakshi

యూనిట్‌కు 5 కిలోలు కేటాయించిన కేంద్రం

ఇంకా రాష్ట్ర కోటాపై స్పష్టత కరువు 

రెండు రోజుల్లో  బియ్యం కొటా కేటాయింపు

సర్కారు ఆదేశాల కోసం ఎదురు చూపులు  

సాక్షి, సిటీబ్యూరో:  ఆహార భద్రత కార్డుదారులకు శుభవార్త. మరో ఏడాది పాటు ఉచిత రేషన్‌ అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌Œఎఫ్‌ఎస్‌ఏ) కింద పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరి నుంచి కూడా ఉచితంగానే రేషన్‌ బియ్యం పంపిణీ కానున్నాయి. కేంద్రం కోటాకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కలిపి ఉచితంగా పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ కోటాపై నిర్ణయం తీసుకోలేదు. ఉచిత కోటాతో ఆరి్థక భారంపై తర్జనభర్జన పడుతోంది. దీంతో కేవలం కేంద్రం కేటాయించే  యూనిట్‌కు 5 కిలోలు మాత్రమే వర్తింపజేస్తుందా..లేక గతంలో మాదిరిగా అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 10 కిలోలు వర్తింప చేస్తుందా ? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.  

2020  నుంచి ఉచితంగానే.. 
కేంద్ర ప్రభుత్వం కరోనా ఆర్థిక సంక్షోభం నేపధ్యంలో ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజికేఎవై) పథకం కింద 2020 ఏప్రిల్‌ నుంచి యూనిట్‌æ(ఒక్కొక్కరికి) ఉచితంగా 5 కేజీల చొప్పున  బియ్యం కోటా కేటాయిస్తూ వచి్చంది. అప్పటి నుంచి పలు పర్యాయాలుగా ఈనెల 31 దాకా పొడిగిస్తూ వచి్చంది.తాజాగా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏతో పీఎంజీకేఏవైని విలీనం చేసి ఆహార భద్రత చట్టం కింద ఉచితంగా అందించాలని నిర్ణయించింది. 

సగం కార్డుదారులు... 
మహానగర పరిధిలోని ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాల్లో సగానికి పైగా అనర్హత కలిగిన కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా ఉచిత బియ్యం 70 నుంచి 80 శాతం కుటుంబాలు ప్రతి నెలా డ్రా చేస్తున్నారు. మిగిలిన 20నుంచి 30 శాతం మాత్రం కార్దులు రద్దు కాకుండా రెండు నెలలకు ఒకసారి సరుకులు డ్రా చేస్తూ వస్తున్నారు. మొత్తం మీద బియ్యం డ్రా చేసే కుటుంబాల్లో 10 శాతం మంది డీలర్లకే కిలో ఒక్కంటికి రూ. 8 నుంచి 10 లకు విక్రయిస్తుండగా, మిగిలిన 20 శాతం  కటుంబాలు కిరాణం, ఇడ్లీ బండి, చిరు వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
చదవండి: తల్లి హీరాబెన్‌ పాడె మోసిన ప్రధాని మోదీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top