రోగులకు ఊరట

Cath Lab MRI Scanning Machines Available At Gandhi Hospital Secunderabad - Sakshi

‘గాంధీ’లో ఎమ్మారై, క్యాథ్‌ల్యాబ్‌లు 

నేడు ప్రారంభించనున్న మంత్రులు

గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిలో అత్యాధునిక వైద్య యంత్రాలు క్యాథ్‌ల్యాబ్, ఎమ్మారై స్కానింగ్‌ మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆదివారం మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మెహమూద్‌ఆలీలతో కలిసి వైద్య శాఖ హరీష్‌రావు వీటిని ప్రారంభిస్తారని గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు. గాంధీ రేడియాలజీ, కార్డియాలజీల్లో 2010లో ఏర్పాటు చేసిన ఎమ్మారై, క్యాథ్‌ల్యాబ్‌లు కాలపరిమితి ముగియడంతో తరచూ మొరాయిస్తున్నాయని ఆస్పత్రి పాలనాయంత్రాంగం విజ్ఞప్తికి మంత్రి హరీష్‌రావు స్పందించి ఆదేశాలు జారీ చేయడంతో రూ.9.5 కోట్లతో ఎమ్మారై స్కానింగ్, రూ.13.5 కోట్లతో క్యాథ్‌ల్యాబ్‌ను కొనుగోలు చేశారు.

కరోనా లాక్‌డౌన్, రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం తదితర కారణాలతో ఆయా యంత్ర విడిభాగాలు ఇతర దేశాల నుంచి దిగుమతి కావడంలో జాప్యం ఏర్పడింది. మంత్రి ఆదేశాల మేరకు జర్మనీ, జపాన్‌ దేశాల నుంచి వాయు మార్గంలో యంత్ర విడిభాగాలను దిగుమతి చేసుకుని, నిరుపేద రోగులకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top