చేనేత మృతుల కుటుంబాలను ఆదుకోండి  

BSP Leader Praveen Kumar Demanded Rs 10 Lakh Compensation For Handloom Families - Sakshi

ఖైరతాబాద్‌: ఆర్థిక ఇబ్బందులతో మూకుమ్మడిగా ఆత్మ హత్యలకు పాల్పడ్డ కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం కాట్నాపల్లికి చెందిన చేనేత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని  బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కోరారు. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ చేనేతన్నల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

కమిటీ చైర్మన్‌ దాసు సురేష్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రవీణ్‌కుమార్, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు మాట్లాడారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడినా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దారుణమన్నారు.  కార్యక్రమంలో సీపీఐ నేత పాశికంటి లక్ష్మినర్సయ్య, బీసీ మహిళానేత శారద గౌడ్, సాజిదా సికిందర్, బోనం ఊర్మిళ, వీరస్వామి  పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top