సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఆందోళన నెలకొంది. సభలో బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనకు దిగారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ పోడియం ఎదుట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు.
బీఆర్‌ఎస్ నిరసనల మధ్యే మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే మైనింగ్‌పై విచారణకు ఆదేశించామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత కమిటీ ఎందుకు?. బీఆర్‌ఎస్ దగ్గర ఆధారాలుంటే సీఐడీకి ఇవ్వొచ్చని శ్రీధర్‌బాబు అన్నారు.

అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్‌పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ నిలదీసింది.


