ఇక్కడ జిమ్‌ చేస్తే ఎముకలు విరగాల్సిందే.. | Broken Equipment Found at Newly Inaugurated Open Gym in Gagan Mahal Colony | Sakshi
Sakshi News home page

ఇక్కడ జిమ్‌ చేస్తే ఎముకలు విరగాల్సిందే..

Jun 27 2026 7:53 AM | Updated on Jun 27 2026 7:53 AM

Broken Equipment Found at Newly Inaugurated Open Gym in Gagan Mahal Colony

కవాడిగూడ డివిజన్‌లోని గగన్‌మహల్‌ కాలనీలో శుక్రవారం ఓపెన్‌ జిమ్‌ ప్రారంభమైంది. చక్కటి పార్కులో..ఆహ్లాదకర వాతావరణంలో అందమైన పరికరాలతో కసరత్తులు చేయొచ్చని కాలనీ వాసులు సంబర పడ్డారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడి పరికరాలు పరిశీలించి స్థానికులు అవాక్కయ్యారు. విరిగిపోయిన పరికరం చూసి..వామ్మో ఇక్కడ వ్యాయామం చేస్తే గాయపడాల్సిందేనని పెదవి విరిచారు. అధికారులు పరికరాల డ్యామేజీని చూసుకోకుండానే ఆర్భాటంగా జిమ్‌ను..ఏకంగా కేంద్ర మంత్రితో ప్రారంభింపజేశారని స్థానికులు విమర్శించారు. వెంటనే స్పందించి విరిగిన పరికరాలను మార్చాలని విజ్ఞప్తి చేశారు. 
– కవాడిగూడ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement