breaking news
Open Gym
-
ఇక్కడ జిమ్ చేస్తే ఎముకలు విరగాల్సిందే..
కవాడిగూడ డివిజన్లోని గగన్‌మహల్ కాలనీలో శుక్రవారం ఓపెన్ జిమ్ ప్రారంభమైంది. చక్కటి పార్కులో..ఆహ్లాదకర వాతావరణంలో అందమైన పరికరాలతో కసరత్తులు చేయొచ్చని కాలనీ వాసులు సంబర పడ్డారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడి పరికరాలు పరిశీలించి స్థానికులు అవాక్కయ్యారు. విరిగిపోయిన పరికరం చూసి..వామ్మో ఇక్కడ వ్యాయామం చేస్తే గాయపడాల్సిందేనని పెదవి విరిచారు. అధికారులు పరికరాల డ్యామేజీని చూసుకోకుండానే ఆర్భాటంగా జిమ్‌ను..ఏకంగా కేంద్ర మంత్రితో ప్రారంభింపజేశారని స్థానికులు విమర్శించారు. వెంటనే స్పందించి విరిగిన పరికరాలను మార్చాలని విజ్ఞప్తి చేశారు. – కవాడిగూడ -
ఓపెన్‌జిమ్‌ను ప్రారంభించిన MP అవినాష్ రెడ్డి
-
ఉచితంగా ఓపెన్ జిమ్
న్యూఢిల్లీ: లోధీ గార్డెన్లో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ అందుబాటులోకి వచ్చింది. దీనిని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి మంగళవారం ప్రారంభించారు. ఇదే తరహాలో మరికొన్ని ఓపెన్‌జిమ్‌లను మరో 28 చోట్ల ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఎన్డీఎంసీ ప్రాజెక్టు డెరైక్టర్ ఓపీ మిశ్రా వెల్లడించారు. ‘ఓపెన్ జిమ్‌లు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచాలనేదే మా ఆలోచన. తొలుత వీటిని ఉద్యానవనాల్లో ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత పాఠశాలలు, రెసిడెన్షియల్ కాలనీలతోపాటు పేవ్‌మెంట్లపైనా ఏర్పాటు చేస్తాం. ఓపెన్ జిమ్లలోని పరికరాల వినియోగానికి విద్యుత్ అవసరమే లేదు. నిర్వహణ వ్యయం కూడా తక్కువే. ఒక్కొక్క జిమ్ ఏర్పాటుకు రూ. 5.5 లక్షల వ్యయం అవుతోంది. ఇలా ఉద్యానవనాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయ డం ఇదే తొలిసారి. జిమ్‌కు వెళ్లే స్తోమత అందరికీ ఉండదు. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడమే మా లక్ష్యం. ఏ వయసు వారైనా వీటిని వినియోగించుకోవచ్చు. జిమ్‌లకు వెళ్లేందుకు సీనియర్ సిటిజన్లు ఇష్టపడరు. అయితే వారు కేవలం మార్నింగ్ వాక్కు మాత్రమే వస్తారు. ఓపెన్ జిమ్‌ల ఏర్పాటువల్ల వాటిని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. వారు వాకింగ్‌తో పాటు వ్యాయామంవైపు కూడా ఇకమీదట దృష్టి సారిస్తారు’ అని అన్నారు. కాగా సెంట్రల్ పార్కు (కన్నాట్‌ప్లేస్), సంజయ్ పార్కు, తాల్కటోరా స్టేడియం, నెహ్రూ పార్కు, ఎన్డీఎంసీ క్లబ్ తదితర ప్రాంతాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయనుంది. ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 40 లక్షల నిధుల్ని కేటాయించింది. వీటి ఏర్పాటుకు అనువైన పేవ్మెంట్ల కోసం ఎన్డీఎంసీ అన్వేషిస్తోంది. లోధీ గార్డెన్‌కు సందర్శకులు అత్యధిక సంఖ్యలో వస్తుంటారు.


