
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా రాజాసింగ్.. యూ ట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది.
దీంతో, ముజ్లిస్ నేతలు.. తమ మనోభావాలను కించపరిచే విధంగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈక్రమంలో మజ్లిస్ నేతలు.. అర్ధరాత్రి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో బైఠాయించి నిరసనలకు దిగారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ పలు పీఎస్‌లలో ఫిర్యాదులు చేశారు. భవానీనగర్, డబీర్‌పురా, రెయిన్ బజార్ పీఎస్‌లలో ఫిర్యాదులు చేయడంతో రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో హై టెన్షన్ నెలకొంది.