జూబ్లీహిల్స్‌ కేసుపై ఎన్‌హెచ్చార్సీ, మహిళా కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు

BJP Complaints To NHRC And Mahila Commission In Jubilee Hills Gangrape Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో బాలిక సామూహిక అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ సరిగా స్పందించడం లేదని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఈ కేసులో బాధిత బాలికకు పూర్తిన్యాయం జరిగేదాకా, నిందితులను అరెస్ట్‌ చేసి, దోషులకు శిక్షపడేదాకా ఆందోళనలు, ధర్నాలు, ఇతర రూపాల్లో ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అలాగే బీజేపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో దీనిపై బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నగర పార్టీలోని వివిధ విభాగాలు, నాయకులతోపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు సోమవారం సమావేశమై ఆయా అంశాలపై చర్చించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top