Rosaiah Last Rites: ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు

AP Former CM Konijeti Rosaiah Last Rites At Hyderabad Live Updates - Sakshi

Live Updates

► మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. కొంపల్లి రోశయ్య ఫాంహౌస్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి రోశయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం రోశయ్య చితికి పెద్ద కుమారుడు శివ సుబ్బారావు నిప్పంటించారు.

ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చితి వద్దకు మాజీ సీఎం రోశయ్య పార్థివదేహాన్ని తీసుకువచ్చారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కడసారి చూసేందుకు నేతలు భారీగా తరలివచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.

గాంధీభవన్‌ నుంచి ప్రారంభమైన రోశయ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో హైదరాబాద్‌ శివార్లోని దేవరయాంజాల్‌లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

రోశయ్య పార్థివదేహం గాంధీభవన్‌కు చేరుకుంది. కాసేపట్లో దేవరయాంజాల్‌  ఫాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రోశయ్య పార్థివదేహానికి పలువురు నేతలు నివాళులర్పించారు. రోశయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌,పేర్ని నాని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు, సినీనటుడు చిరంజీవి నివాళులర్పించారు. రోశయ్య అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌ హాజరుకానున్నారు.

మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలను మధ్యాహ్నం ఒంటిగంటకు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.  రోశయ్య పార్థవదేహాన్ని ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యాలమైన గాంధీభవన్‌కు తీసుకెళ్లనున్నారు. సందర్శన తర్వాత హైదరాబాద్‌ శివార్లోని దేవరయాంజాల్‌లోని వ్యవసాయ క్షేత్రానికి తరలించనున్నారు. మధ్యాహం అక్కడ రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top