అభిమాని ప్రీమియర్‌ లీగ్‌.. | animated and intense conversation | Sakshi
Sakshi News home page

అభిమాని ప్రీమియర్‌ లీగ్‌..

Apr 26 2026 6:12 AM | Updated on Apr 26 2026 6:12 AM

animated and intense conversation

    రీల్స్, మీమ్స్‌తో యువత హంగామా 

    ఆన్‌లైన్‌లో క్రియేటివ్‌గా కంటెంట్‌ సృష్టి 

    సునిశితంగా ఎడిటింగ్‌.. ఫన్నీ రియాక్షన్లు  

    శరవేగంతో వైరల్‌ అవుతున్న వైనం

ఈ నెల 20న.. ముంబై ఇండియన్స్‌ –గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌..! హైదరాబాదీ కుర్రాడు తిలక్‌వర్మ ధాటిగా ఆడలేకపోతున్నాడు. ముంబై కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా వచ్చి అతడితో ఏదో గట్టిగా మాట్లాడాడు. ఆ తర్వాత తిలక్‌ రెచి్చపోయి బాదేశాడు. సెంచరీ కొట్టాడు. తెల్లవారి చూస్తే, తిలక్‌తో వేడిగా సాగిన హార్దిక్‌ సంభాషణ సోషల్‌ మీడియా రీల్‌గా మారిపోయింది.

సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఓ బ్యాట్స్‌మన్‌ అవుటైన సమయానికి, స్టాండ్స్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) అభిమాని నిమ్మకాయతో కనిపించడం వైరల్‌ అయింది. దీంతో అతీంద్రియ శక్తులను ఆపాదిస్తూ హాస్యభరిత వీడియోలు ఆన్‌లైన్‌లో సందడి చేశాయి.

సాక్షి,హైదరాబాద్‌  : మైదానంలో క్రీడాకారులు బంతులతో, బ్యాట్స్‌తో ఆడుకుంటుంటే.. మైదానం వెలుపల వారిని యువ వీక్షకులు రీల్స్‌తో, మీమ్స్‌తో ఆడేసుకుంటున్నారు. ఈ క్రియేటర్ల ధాటికి జెంటిల్మన్‌ గేమ్‌ నేడు చిలిపి సందడికి చిరునామాగా మారిపోయింది. వినోద ప్రధానంగా రూపుదిద్దుకున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) కాన్సెప్ట్‌ సోషల్‌ మీడియా విజృంభణతో ఊహించని స్థాయిలో హై‘పిచ్‌’ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా మారింది. ఇన్‌స్ట్రాగామ్‌ రీల్స్‌ నుంచి ఎక్స్‌లో పోస్టుల వరకు, ట్రోలింగ్‌ అంతటా వ్యాపించింది. అత్యంత నేర్పుగా... ఆద్యంతం కట్టిపడేసేలా చేసిన ఎడిట్‌లు, ఫన్నీ రియాక్షన్‌లు నిమిషాల వ్యవధిలోనే ప్రపంచాన్ని 
చుట్టేస్తున్నాయి.  

జెన్‌ జీ ట్రెండ్‌.. 
ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా, రీల్స్‌ మీమ్స్‌తో సోషల్‌ మీడియా హోరెత్తుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జెన్‌ జెడ్‌... ఐపీఎల్‌తో మీమ్స్, రీల్స్‌ ఫాంటసీ లీగ్‌ల ద్వారా ఎక్కువగా మమేకమవుతున్నారు. ఈ ప్లాట్‌ఫామ్స్‌ తాజా లీగ్‌ను ‘మీమ్‌ పండగ’గా మార్చాయి. ఐపీఎల్‌లో జరుగుతున్న చిన్నచిన్న ఘటనలను కూడా శరవేగంగా వైరల్‌ అయ్యేలా చేస్తున్నాయి.  

కాదేదీ కామెడీకి అనర్హం  
ఒక అభిమాని ఇన్‌స్ట్రాగామ్‌ రీల్‌ కోసం పాపులర్‌.. ‘రింగ్‌ టాస్‌’ ట్రెండ్‌ను ప్రయత్నిస్తూ రూ.70 వేల విలువైన ఉంగరాన్ని పోగొట్టుకోవడం వైరల్‌ అయింది. ఆ ఉంగరం జారిపోయి... దొరక్కపోవడంతో దీనిపై ఆన్‌లైన్‌లో మీమ్స్‌ స్పందనలు వెల్లువెత్తాయి. 

డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ చాంపియన్‌ చెన్నూ సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) మధ్య పోటీలు, జట్ల ప్రదర్శన, కెప్టెన్సీ.. అంతులేని మీమ్స్‌ను సృష్టించాయి. ‘ఈ సాలా కప్‌ నమదే’ జోకులు, ‘తలా ఫర్‌ ఎ రీజన్‌’ మీమ్స్‌ సందడి చేశాయి. ఆయా జట్ల మద్దతుదారులు చెలరేగి నాన్‌స్టాప్‌గా 
ట్రోలింగ్‌కు దిగారు.

ఆపాదించుకుని.. ఆస్వాదిస్తూ 
ఒకప్పుడు లైవ్‌ క్రికెట్‌ను చూడడానికి మాత్రమే అలవాటు పడిన నగర వాసులు.. ఇప్పుడు క్రికెట్‌లో పరోక్షంగా పాల్గొనడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మాŠయ్‌చ్‌ పరిస్థితులను ఆపాదించుకుని రీల్స్‌ చేస్తూ ఆస్వాదిస్తున్నారు. వాటిలో స్వయంగా నటిస్తూ తామూ క్రికెటర్లమేనన్న అనుభూతిని పొందుతున్నారు. సహజంగానే వినూత్నతను ఇష్టపడే యువత.. ఈ తరహా ట్రెండ్‌తో మరింత మజా పొందుతున్నారు. దానికి తమదైన శైలిలో కామెంట్లు పెడుతూ.. ఇతరుల కామెంట్లు కూడా చదువుతూ ఆనందిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement