Secunderabad Railway Station: రైల్వేస్టేషన్‌ వదిలి వెళ్లిపోండి.. లేదంటే మరోసారి కాల్పులు

Agneepath Protests: Railway Police Warning to Protesters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పోలీసులు కాల్పులు జరిపినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఆందోళనకారులు రైల్వే పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. నాలుగు గంటలకు పైగా రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకారులు రైల్వేస్టేషన్‌ వదిలి వెళ్లిపోవాలని రైల్వే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళన విరమించకపోతే మళ్లీ కాల్పులు జరుపుతామని హెచ్చరించారు. అయితే ఇప్పటికీ రైల్వే ట్రాక్‌లపై వేలాది మంది నిరసనకారులు ఉన్నారు.

చదవండి: (Agnipath Protest: అప్రమత్తమైన రైల్వేశాఖ.. 71 రైళ్లు రద్దు)

ఇదిలా ఉంటే, ఆందోనకారులు మాత్రం కాల్పులు జరపాలని ఎవరు ఆర్డర్‌ ఇచ్చారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'న్యాయం చేయాలని ఆందోళన చేస్తే కాల్పులు జరుపుతారా. న్యాయం అడిగితే చంపేస్తారా' అంటూ విద్యార్థులు రైల్వే పోలీసులపై మండిపడుతున్నారు.

చదవండి: (Agnipath Protests Hyderabad: అమిత్‌షాతో కిషన్‌ రెడ్డి కీలక భేటీ) 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top