ఆత్మహత్యగా నిర్ధారించిన పోలీసులు?

After Postmortem Accused Raju Funerals Completed In Warangal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడు రాజు మృతిపై వస్తున్న వార్తలకు ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం వైద్యులు చెబుతున్న దాన్ని బట్టి రాజు ఆత్మహత్యేగా స్పష్టంగా తెలుస్తోంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న రాజు మృతదేహాన్ని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మొదటి రాజు కుటుంబసభ్యులకు చూపించారు. ఆ మృతదేహం రాజుదేనని ధ్రువీకరించడంతో వైద్యులు పోస్టుమార్టం చేశారు.

అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి కాకుండా వరంగల్‌లోని పోతన కాలనీ శ్మశాన వాటికలో బంధువులు అంత్యక్రియలు పూర్తిచేశారు. తల్లి కుమారుడి చితికి నిప్పటించారు. భార్య కూడా హాజరయ్యారు. కాగా నిందితుడి పోస్టుమార్టం ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం కానుంది. రాజు మృతదేహానికి గంటపాటు ఫోరెన్సిక్ వైద్యులు రజా మాలిక్, ఫోరెన్సిక్ వైద్యుడు, వరంగల్ ఎంజీఎం రాజు పోస్టుమార్టం చేశారు.

అనంతరం వైద్యులు మీడియాతో మాట్లాడారు. మృతదేహంపై ట్రైన్ గాయాలు, గ్రీజు ఉన్నాయని చెప్పారు. రైల్వే ప్రమాదం గాయాలను గుర్తించినట్లు తెలిపారు. మృతదేహంపై ఇతర గాయాలేమైనా ఉన్నాయా అనేది పరిశీలించినట్లు వివరించారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేసినట్లు వెల్లడించారు. డీఎన్ఏ టెస్ట్ కోసం రాజు ఎముకలు సేకరించినట్లు పేర్కొన్నారు. రాజు మత్తు పదార్థాలు సేకరించాడా అనేది పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top