సార్‌.. వస్తున్నారని ఆతృత.. జారిపడిన విద్యార్థి  | 8th Class Student Left Hand Was Broken at School In Moosapet | Sakshi
Sakshi News home page

సార్‌.. వస్తున్నారని ఆతృత.. జారిపడిన విద్యార్థి 

Nov 26 2021 11:32 AM | Updated on Nov 26 2021 11:46 AM

8th Class Student Left Hand Was Broken at School In Moosapet - Sakshi

సాక్షి, మూసాపేట: మూసాపేట బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి (ఇంగ్లిష్‌ మీడియం) చదువుతున్న విశ్వనాథ్‌ ఎడమ చేయి బుధవారం పాఠశాలలో విరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తరగతి గది బయట విద్యార్థులు మాట్లాడుతుండగా ఓ విద్యార్థి సార్‌ వస్తున్నాడు అని చెప్పడంతో తోటి విద్యార్థులు అందరూ ఒక్కసారిగా తరగతి గదిలోకి వెళ్ళారు.

ఈ క్రమంలో విశ్వనాథ్‌ అనే విద్యార్థి బెంచి తగిలి కింద పడటంతో అతనిపై మిగతా విద్యార్థులు పడగా విశ్వనాథ్‌ చేయి విరిగింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. టీచర్‌ తరగతి గదికి వచ్చే గ్యాప్‌లో ఈ సంఘటన జరిగిందని హెచ్‌ఎం రాజ్‌ పాల్‌ సింగ్‌ తెలిపారు. సకాలంలో తరగతికి ఉపాధ్యాయులు హాజరు కాలేకపోవడం వల్లే ప్రమాదం జరిగింది అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement