‘కరోనా వచ్చాక.. 80 వేల కోట్ల రుణాలు ఇచ్చాం’

800 debts released after corona starts says Govindarajulu - Sakshi

సాక్షి, హైదరాబాద్ : కరోనా వచ్చాక మార్చి 1 నుంచి జూలై వరకు 80 వేల కోట్ల రుణాలు మంజూరు చేశామని నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు అన్నారు. ఈ సంవత్సరం 5.30 లక్షల కోట్ల నుంచి 6.5 లక్షల కోట్ల బిజినెస్ టార్గెట్‌గా పనిచేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళ నాడులనుంచే 42 శాతం బిజినెస్ ఉంటుందన్నారు. ‘కోటి 8 లక్షల మైక్రో గ్రూప్‌లు ఉన్నాయి. మహిళలకు 2.5 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నాం. దేశంలో కోటి 8లక్షల గ్రూప్‌లను ఈ శక్తి ప్లాట్ ఫాం మీదకు తీసుకురావాలనుకుంటున్నాం.

నాబార్డ్ ద్వారా కొత్త పథకాలు తీసుకురావాలనుకుంటున్నాం. ఆత్మనిర్భర్ భారత్ కింద రైతులు, మహిళ గ్రూప్‌లను బలోపేతం చేయాలనుకుంటున్నాం. ప్రాథమిక సహకార సంఘాలకు కేవలం 3శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నాం. కోఅపరేటివ్ సొసైటీలను అన్నింటినీ కంప్యూటరైజ్ చేయాలని నిర్ణయించాము. కోఅపరేటివ్, గ్రామీణ బ్యాంకులను బలోపేతం చేస్తున్నాం. రైతుల ఆదాయం పెంపొందించేందుకు నాబార్డు ప్రయత్నం చేస్తోంది. అగ్రికల్చర్‌లో క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ తీసుకురాబోతున్నాం. పుడ్ ప్రాసెసింగ్ కోసం స్వయం సహాయక గ్రూప్‌లకు 5శాతానికే లోన్లు ఇస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు డబ్బులు ఇచ్చాం.. రెండో ప్రాజెక్టుకు ఇవ్వబోతున్నాం. తెలంగాణలో 900 కోట్లతో చెక్ డ్యామ్‌లను నిర్మిస్తున్నాం. రుణమాఫీ అనేది పొలిటికల్ నిర్ణయం. మాఫీ డబ్బులు పూర్తిగా బ్యాంకులకు చెల్లించాలి’ అని గోవిందరాజులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top